ప్రధాన మంత్రి కార్యాలయం
మహారాష్ట్ర లోనినాసిక్ లో గల శ్రీ కాలారామ్ మందిరం లో దైవదర్శనం మరియు పూజ లలో పాలుపంచుకొన్నప్రధాన మంత్రి
స్వామి వివేకానంద విగ్రహానికి పుష్పాంజలి ఘటించిన ప్రధాన మంత్రి
Posted On:
12 JAN 2024 3:18PM by PIB Hyderabad
మహారాష్ట్ర లోని నాసిక్ లో గల శ్రీ కాలారామ్ మందిరం లో ఈ రోజు న దైవ దర్శనం మరియు పూజ లలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకొన్నారు. శ్రీ రామ కుండం ను కూడాను ఆయన దర్శించుకొని, పూజ లో పాల్గొన్నారు. స్వామి వివేకానంద విగ్రహానికి ఆయన పుష్పాంజలి ని సమర్పించారు.
నాసిక్ లో ఈ రోజు న సంప్రదాయం మరియు సాంకేతిక విజ్ఞానం ల యొక్క చెప్పనుకోదగ్గ మేలు కలయిక కానవచ్చింది. రామాయణ మహాకావ్యం ప్రవచనాన్ని మరీ ముఖ్యం గా ప్రభువు రాముడు అయోధ్య కు తిరిగి రావడాన్ని వర్ణించేటటువంటి ‘యుద్ధ కాండ’ ను ప్రధాన మంత్రి ఆలకించారు. దీనిని మరాఠీ భాష లో పఠించగా, ప్రధాన మంత్రి దీని హిందీ కథనాన్ని ఎఐ అనువాదం ద్వారా విన్నారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశంలో -
‘‘నాసిక్ లోని శ్రీ కాలారామ్ మందిరం లో జరిగిన ప్రార్థన లో పాల్గొన్నాను. దివ్యమైన వాతావరణం లో నమ్మశక్యమేనా అనేటటువంటి అనుభూతి కలిగి, ధన్యుడినైన భావన కలిగింది. నిజంగా ఎంతో నిరాడంబరం అయినటువంటి మరియు ఆధ్యాత్మికత్వం తో కూడినటువంటి అనుభవం అది. నేను నా తోటి భారతీయుల కు శాంతి మరియు శ్రేయం చేకూరాలి అని ఆ పరమాత్మ ను ప్రార్థించాను.’’
‘‘నాసిక్ లో ఉన్న రామకుండం లో జరిగిన పూజ కార్యక్రమం లో పాలుపంచుకొన్నాను.’’
‘‘ప్రభువు శ్రీ రాముడు విజయుడై అయోధ్య కు తిరిగి రావడాన్ని విపులం గా వర్ణిస్తూ సంత్ ఏక్ నాథ్ జీ మరాఠీ భాష లో వ్రాసిన భావార్థ రామాయణం లోని ఛందస్సు లను ఆలకించే ప్రగాఢమైన అనుభూతి శ్రీ కాలారామ్ ఆలయం లో నాకు ప్రాప్తించింది. భక్తి మరియు చరిత్ర లు ప్రతిధ్వనించిన ఈ పఠనం చాలా ప్రత్యేకమైనటువంటి అనుభవాన్ని అందించింది.’’
నాసిక్ లో స్వామి వివేకానంద కు శ్రద్ధాంజలి ఘటించాను. ఆయన యొక్క శాశ్వతమైన ఆలోచన లు మరియు దృష్టికోణం మనలకు ప్రేరణ ను అందిస్తూనే ఉంటాయి.’’ అని పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1995593)
Visitor Counter : 105
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Tamil
,
Malayalam