ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భూటాన్ పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన గౌరవనీయ షెరింగ్ టొబగే.. ‘పిడిపి’కి ప్రధాని అభినందన

Posted On: 09 JAN 2024 10:05PM by PIB Hyderabad

   భూ టాన్‌లో పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన గౌరవనీయ షెరింగ్ టొబగే, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి)కి  ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.

ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:

‘‘భూటాన్‌ పార్లమెంటు ఎన్నికలలో విజయం సాధించిన నా మిత్రుడు షెరింగ్ టొబగే,  @tsheringtobgay సహా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీకి నా హృదయపూర్వక అభినందనలు. మన రెండు దేశాల మధ్య స్నేహం, సహకారంతో కూడిన మన విశిష్ట సంబంధాలను మరోసారి మరింత బలోపేతం చేసే దిశగా సంయుక్త కృషికి కట్టుబడి ఉన్నాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/AK


(Release ID: 1994721) Visitor Counter : 150