మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరీక్షా పే చర్చ 2024 లో పాల్గొనడానికి రికార్డు స్థాయిలో పేర్లు నమోదు చేసుకున్న కోటి మంది


న్యూఢిల్లీలోని భారత్ మండపంలో 2024 జనవరి 24న పరీక్షా పే చర్చ 2024 నిర్వహణ
MyGov లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం 2024 జనవరి 12 వరకు అవకాశం

ప్రధానమంత్రి తో మాట్లాడటానికి ఉత్సాహంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్న విద్యార్థులు

Posted On: 05 JAN 2024 2:18PM by PIB Hyderabad

పరీక్షా పే చర్చ 2024 లో పాల్గొనడానికి రికార్డు స్థాయిలో కోటి మంది తమ  పేర్లు నమోదు చేసుకున్నారు. పరీక్షా పే చర్చ 2024 లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశం వివిధ ప్రాంతాలకు చెందిన పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో నేరుగా మాట్లాడతారు. పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్వహించడం ఇది 7వ సారి. కార్యక్రమంలో పాల్గొనడానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

పరీక్షలు, పాఠశాల తర్వాత జీవితానికి సంబంధించిన ఆందోళనలపై   విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో చర్చించేందుకు ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వినూత్న రీతిలో పరీక్షా పే చర్చా (PPC)ని రూపొందించారు. దేశం వివిధ ప్రాంతాలకు చెందిన  విద్యార్థులు, తల్లిదండ్రులు,ఉపాధ్యాయులు, విదేశాల నుంచి కూడా ఆయనతో కలిసి పరీక్షలు, పాఠశాల తర్వాత జీవితానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. విద్యా మంత్రిత్వ శాఖ అనుబంధంగా పనిచేస్తున్న  పాఠశాల విద్య ,అక్షరాస్యత విభాగం  గత ఆరు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని  విజయవంతంగా నిర్వహించింది. 

ఈ సంవత్సరం పరీక్షా పే చర్చ 2024  కార్యక్రమం 2024 జనవరి 29   ఉదయం 11 గంటల నుంచి  టౌన్-హాల్ ఆకృతిలో భారత్ మండపం,ఐటీపిఓ , ప్రగతి మైదాన్, న్యూఢిల్లీలో జరుగుతుంది. . దాదాపు 4000 మంది  ఈ కార్యక్రమంలో ప్రధాని తో సంభాషించనున్నారు. ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి  ఇద్దరు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు, కళా ఉత్సవ్ , వీర్ గాథ పోటీల విజేతలకు  ప్రధాన కార్యక్రమంలో  ప్రత్యేక అతిథులుగా పాల్గొనడానికి ఆహ్వానాలు అందే అవకాశం ఉంది.  

2023 డిసెంబర్ 11 న ప్రారంభమైన MyGov లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్  2024 జనవరి 12 వరకు అందుబాటులో ఉంటుంది.  6వ తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు MCQ పోటీ  పోటీలో పాల్గోవచ్చు.  5 జనవరి 2024 నాటికి 90 లక్షల మంది విద్యార్థులు, 8 లక్షల మంది ఉపాధ్యాయులు, దాదాపు 2 లక్షల మంది తల్లిదండ్రులు నమోదు చేసుకున్నారు.

ప్రధానమంత్రి నేతృత్వంలో అమలు జరుగుతున్న ‘ఎగ్జామ్ వారియర్స్’లో భాగంగా పరీక్షా పే చర్చ కార్యక్రమం జరుగుతుంది.  ఒత్తిడి లేని వాతావరణాన్ని సృష్టించడానికి ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోదీ ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకు వచ్చి ప్రతి బిడ్డ తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుని, స్వేచ్ఛగా తన భావాలు వ్యక్తీకరించడానికి అవకాశం కల్పించడానికి   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ రచించిన 'ఎగ్జామ్‌ వారియర్స్‌' అనే పుస్తకం రికార్డు స్థాయిలో అమ్మకాలు సాగించడం కార్యక్రమం విజయానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది. . 

దీన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రధాన కార్యక్రమానికి ముందు 2024 జనవరి ( యువజన దినోత్సవం) నుంచి జనవరి 23   వరకు పాఠశాల స్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు.  మారథాన్ రన్, సంగీత పోటీ, నుక్కడ్ నాటకం, విద్యార్థి-యాంకర్-విద్యార్థి-అతిథి చర్చలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా  చివరి రోజు 2024  జనవరి 23 న   దేశవ్యాప్తంగా 500 జిల్లాల్లో పెయింటింగ్ పోటీలు జరుగుతాయి.  చంద్రయాన్, భారతదేశం  క్రీడా విజయం మొదలైన అంశాలపై పోటీలు జరుగుతాయి.  ఇది పరీక్షలు జీవిత ఉత్సవ్‌గా ఎలా ఉండవచ్చో చూపిస్తుంది.

 MyGov పోర్టల్‌లో  ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు ఆధారంగా  దాదాపు 2050 మందిని ఎంపిక చేస్తారు.  హిందీ ,ఆంగ్లంలో  ప్రధానమంత్రి రాసిన పరీక్షా వారియర్స్ పుస్తకం, సర్టిఫికేట్‌తో కూడిన ప్రత్యేక పరీక్షా పే చర్చా కిట్‌ను అందజేస్తారు.

***


(Release ID: 1993881) Visitor Counter : 321