ప్రధాన మంత్రి కార్యాలయం
అంతర్గత అలంకరణలో కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టెర్మినల్ ప్రపంచ ప్రత్యేక బహుమతి గెలవడంపై బెంగళూరు ప్రజలకు ప్రధాని అభినందన
నాడు పోస్టు చేయడమైనది:
23 DEC 2023 5:25PM by PIB Hyderabad
కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టెర్మినల్ విమానాశ్రయాల విభాగంలో అంతర్గత అలంకరణలో ప్రపంచ ప్రత్యేక బహుమతి-2023 గెలుచుకోవడంపై బెంగళూరు ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నిరుడు ఈ భవన ప్రారంభోత్సవం చిత్రాలను కూడా ఆయన ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:
‘‘ఇదెంతో అద్భుత విజయం! బెంగళూరు ప్రజలకు నా అభినందనలు. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం రెండో టెర్మినల్ ఉజ్వల బెంగళూరు నగరానికి ప్రవేశ ద్వారం మాత్రమే కాదు... నిర్మాణ నైపుణ్యానికి తార్కాణం. మన దేశంలో నైపుణ్య వికాసాన్ని ప్రతిబింబిస్తూ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కళాత్మక సౌందర్యంతో మేళవించడం నిజంగా అత్యద్భుతం. ఇదిగో... నిరుడు ఈ భవన ప్రారంభోత్సవ దృశ్యాలను మరోసారి అవలోకించండి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1990163)
సందర్శకుల సూచీ సంఖ్య : : 140
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam