ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇజ్‌రాయిల్ ప్రధాని తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రస్తుతం కొనసాగుతూ ఉన్న ఇజ్‌రాయిల్-హమాస్ సంఘర్షణ లో ఇటీవలి పరిణామాల ను ప్రధాన మంత్రి కి వివరించిన ప్రధాని శ్రీ నెతన్యాహూ

సముద్ర మార్గ సంబంధి రాకపోకల లో భద్రత అంశం పై ఆందోళనలను ఒకరి కి మరొకరు తెలియబరచుకొన్న ఇద్దరు నేతలు

మానవీయ సహాయం యొక్క ఆవశ్యకత మరియు సంఘర్షణ కు పరిష్కారానికి సంభాషణ , ఇంకా దౌత్యం ల మాధ్యాన్ని   ఆశ్రయించాలంటూ పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి

Posted On: 19 DEC 2023 6:50PM by PIB Hyderabad

ఇజ్‌రాయిల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మాట్లాడారు.

ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నటువంటి ఇజ్‌రాయిల్-హమాస్ సంఘర్షణ లో ఇటీవల చోటు చేసుకొన్న పరిణామాల ను గురించి ప్రధాని శ్రీ నెతన్యాహూ ప్రధాన మంత్రి కి తెలియజేశారు.

సముద్ర మార్గ సంబంధి రాకపోకల భద్రత విషయం లో ఆందోళనల ను నేత లు ఇరువురు ఒకరి తో మరొకరు వెల్లడించుకొన్నారు.

ప్రభావిత జనాభా కు మానవీయ సహాయాన్ని నిరంతరాయం గా అందిస్తూ ఉండవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. దీనికి తోడు గా, మాటామంతీ మరియు దౌత్యం ల మాధ్యం ద్వారా అందరు బందీల యొక్క విడుదల సహా సంఘర్షణ కు ఒక సత్వరమైనటువంటి శాంతియుక్తమైనటువంటి పరిష్కారాన్ని కనుగొనాలని కూడా ఆయన నొక్కిపలికారు.

ఇకమీదట కూడా ఒకరి తో మరొకరు సంప్రదింపులు జరుపుకొంటూ ఉండేందుకు ఇద్దరు నేత లు అంగీకరించారు.

 

***

 


(Release ID: 1988961) Visitor Counter : 92