ప్రధాన మంత్రి కార్యాలయం
నేవీ డే సందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
04 DEC 2023 12:03PM by PIB Hyderabad
నేవీ డే సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన శుభాకాంక్షల ను తెలియ జేశారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘నేవీ డే సందర్భం లో, భారతీయ నౌకాదళం యొక్క సిబ్బంది అందరికీ ఇవే శుభాకాంక్ష లు. మన సముద్రాల సురక్ష విషయం లో వారి యొక్క నిబద్ధత అనేది కర్తవ్యం పట్ల వారి అచంచలమైనటువంటి సమర్పణ భావాని కి మరియు మన దేశ ప్రజల పట్ల వారి కి ఉన్న ప్రేమ కు ఒక నిదర్శన గా ఉంది. ప్రతి ఒక్క పరిస్థితి లోను వారి యొక్క ఉత్సాహం మరియు వారి యొక్క సంకల్పం స్థిరం గా ఉంటున్నాయి. వారు అందిస్తున్నటువంటి సేవ కు మరియు వారు చేస్తున్నటువంటి త్యాగాల కు గాను వారి కి మనం ఎల్లప్పటికీ కృతజ్ఞులము గా ఉంటాం.
నేను ఈ రోజు న మహారాష్ట్ర లోని సింధుదుర్గ్ లో నేవీ డే కార్యక్రమం లో పాలుపంచుకోవాలని ఉత్సాహం గా ఎదురుచూస్తున్నాను. ఈ ప్రదేశాని కి ఛత్రపతి శివాజీ మహారాజ్ తో సన్నిహిత సంబంధం ఉన్నది; బలమైనటువంటి నౌకాదళాన్ని నిర్మించే దిశ లో ఆయన ప్రయాస లు అందరికీ తెలిసినటువంటివే.’’ అని పేర్కొన్నారు.
****
DS/TS
(Release ID: 1982298)
Visitor Counter : 138
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam