ఆర్థిక మంత్రిత్వ శాఖ

అక్టోబరు 2023లో జిఎస్‌టి రాబడి 2023 ఏప్రిల్ తర్వాత రెండవ అత్యధికం, రూ.1.72 లక్షల కోట్ల వసూళ్లు; గత ఏడాది కన్నా 13 శాతం అధికంగా నమోదు


దేశీయ లావాదేవీల నుండి వచ్చిన ఆదాయం (సేవల దిగుమతితో సహా) కూడా 13 శాతం ఎక్కువ

2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ జిఎస్‌టి సేకరణ రూ.1.66 లక్షల కోట్లుగా నమోదు ; 11 శాతం అధికం

Posted On: 01 NOV 2023 2:31PM by PIB Hyderabad

అక్టోబర్, 2023 నెలలో స్థూల  జిఎస్‌టి  ఆదాయం రూ.1,72,003 కోట్లుగా నమోదైంది. అందులో రూ. 30,062 కోట్లు సీ జిఎస్‌టి  కాగా, రూ. 38,171 కోట్లు  ఎస్జిఎస్‌టి , రూ. 91,315 కోట్లు ఐజిఎస్‌టి( వస్తువుల దిగుమతిపై సేకరించిన రూ.42,127 కోట్లతో కలిపి) ఉంది. ఇంకా రూ. 12,456 కోట్లు (వస్తువుల దిగుమతిపై వసూలు చేసిన రూ. 1,294 కోట్లతో సహా) సెస్ గా నమోదైంది.  

ప్రభుత్వం ఐజిఎస్‌టి నుండి సిజిఎస్‌టికి రూ. 42,873 కోట్లు, ఎస్జిఎస్‌టికి రూ. 36,614 కోట్లు చెల్లించింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత అక్టోబర్, 2023లో కేంద్రం, రాష్ట్రాల మొత్తం ఆదాయం సి జిఎస్‌టి కి రూ.72,934 కోట్లు, ఎస్జిఎస్‌టి కి రూ. 74,785 కోట్లు నమోదైంది. 

అక్టోబర్, 2023లో స్థూల జిస్‌టి రాబడి గత ఏడాది ఇదే నెలలో కంటే 13 శాతం ఎక్కువ నమోదైంది. నెలలో, దేశీయ లావాదేవీల నుండి వచ్చే ఆదాయం (సేవల దిగుమతితో సహా) కూడా గత సంవత్సరం ఇదే నెలలో ఈ వనరుల నుండి వచ్చిన ఆదాయాల కంటే 13 శాతం ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరంలో సగటు నెలవారీ  జిఎస్‌టి సేకరణ ఇప్పుడు రూ. 1.66 లక్షల కోట్లు,   అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలం న కంటే ఇది 11 శాతం  ఎక్కువ.

ప్రస్తుత సంవత్సరంలో నెలవారీ స్థూల జిఎస్‌టి ఆదాయాల ట్రెండ్‌లను కింది చార్టు చూపుతుంది. అక్టోబరు 2023 నెల వరకు ప్రతి రాష్ట్రం సెటిల్మెంట్ తర్వాత  జిఎస్‌టి  రాబడి యొక్క రాష్ట్రాల వారీ గణాంకాలను దిగువ చార్టు చూపుతుంది.

పట్టిక : జిఎస్‌టి వసూళ్ల ప్రగతి 

 

పట్టిక: ఐజిఎస్‌టి, ఎస్జిఎస్‌టి లో రాష్ట్రాలు/యూటీ లకు సర్దుబాటు అయినది... ఏప్రిల్-అక్టోబర్ (రూ. కోట్లలో)

 

ముందుగా సెటిల్మెంట్ ఎస్జీఎస్టీ 

ముందుగా సెటిల్మెంట్ ఎస్జీఎస్టీ[1]

రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతం 

2022-23

2023-24

వృద్ధి 

2022-23

2023-24

 వృద్ధి 

జమ్మూ - కాశ్మీర్ 

1,318

1,762

34%

4,299

4,817

12%

హిమాచల్ ప్రదేశ్ 

1,341

1,546

15%

3,368

3,302

-2%

పంజాబ్ 

4,457

4,903

10%

11,378

13,115

15%

చండీగఢ్ 

351

389

11%

1,227

1,342

9%

ఉత్తరాఖండ్ 

2,805

3,139

12%

4,513

4,890

8%

హర్యానా 

10,657

11,637

9%

18,291

20,358

11%

ఢిల్లీ 

8,000

9,064

13%

16,796

18,598

11%

రాజస్థాన్ 

8,832

9,859

12%

19,922

22,571

13%

ఉత్తర ప్రదేశ్ 

15,848

18,880

19%

38,731

42,482

10%

బీహార్ 

4,110

4,731

15%

13,768

15,173

10%

సిక్కిం 

179

297

66%

489

629

29%

అరుణాచల్ ప్రదేశ్ 

282

378

34%

932

1,155

24%

నాగాలాండ్ 

125

177

42%

564

619

10%

మణిపూర్ 

166

210

27%

812

659

-19%

మిజోరాం 

105

168

60%

488

573

18%

త్రిపుర 

242

299

23%

847

928

9%

మేఘాలయ 

265

353

33%

841

988

17%

అస్సాం 

2,987

3,428

15%

7,237

8,470

17%

పశ్చిమ బెంగాల్ 

12,682

13,799

9%

22,998

24,607

7%

ఝార్ఖండ్ 

4,329

5,152

19%

6,466

7,128

10%

ఒడిశా 

8,265

9,374

13%

11,031

12,723

15%

ఛత్తీస్గఢ్ 

4,285

4,773

11%

6,421

7,656

19%

మధ్య ప్రదేశ్ 

6,062

7,384

22%

 

 
...


(Release ID: 1973978) Visitor Counter : 53