ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ ఏకత దినం శుభ సందర్భం లో ‘మేరీ మాటీ మేరా దేశ్’ ప్రచార ఉద్యమంతాలూకు అమృత్ కలశ్ యాత్ర ముగింపు సూచక కార్యక్రమం లో పాలుపంచుకోనున్న ప్రధానమంత్రి


దేశవ్యాప్తం గా ఈ కార్యక్రమం లో భాగం అయ్యే వేలకొద్దీ అమృత్ కలశ్ యాత్రికుల ను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

దేశం లో ప్రతి ఒక్క ప్రాంతం నుండి సేకరించిన మట్టి ని ఉపయోగించి అభివృద్ధి పరచిన అమృత్ వాటిక ను మరియు అమృత్ మహోత్సవ్ స్మారకాన్ని ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

ఈ కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యొక్క ముగింపుకార్యక్రమం గా కూడా ఉంటుంది

‘మేరా యువ భారత్’ (మై భారత్)  పేరు తో యువత కోసం ఉద్దేశించిన ప్లాట్ఫార్మ్  ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

దేశ యువత కు ఉద్దేశించినటువంటి ‘ఎమ్ వై భారత్’ ఒకే చోటు లో సంపూర్ణ ప్రభుత్వ వేదిక గా ఉండబోతోంది

Posted On: 30 OCT 2023 9:11AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 అక్టోబరు 31 వ తేదీ నాడు కర్తవ్య పథ్ లో సాయంత్రం సుమారు 5 గంటల వేళ కు ఏర్పాటైన మేరీ మాటీ మేరా దేశ్ప్రచార ఉద్యమం తాలూకు అమృత్ కలశ్ యాత్ర ముగింపున కు చేరుకొన్నట్లు గా తెలియజేసేటటువంటి ఒక కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు. ఈ కార్యక్రమం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ యొక్క ముగింపు ఘట్టం గా కూడా ఉంటుంది.

ఈ కార్యక్రమం లో భాగం గా అమృత్ వాటిక ను మరియు అమృత్ మహోత్సవ్ స్మారకాన్ని ప్రధాన మంత్రి ప్రారంభిస్తారు. ఆయన దేశం లో వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమం లో జతపడే వేల మంది అమృత్ కలశ్ యాత్రికుల ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

దేశ యువత కు ఉద్దేశించిన మేరా యువ భారత్’ (మై భారత్) వేదిక ను కూడా ప్రధాన మంత్రి ఈ కార్యక్రమం లో భాగం గా ప్రారంభించనున్నారు.

మేరీ మాటీ మేరా దేశ్

దేశం కోసం సర్వోన్నత త్యాగాన్ని చేసిన వీరుల కు మరియు వీరాంగనల కు ఒక శ్రద్ధాంజలి గా మేరీ మాటీ మేరా దేశ్ప్రచార ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. జన్ భాగీదారీ (ప్రజల భాగస్వామ్యం) భావన తో సాగిన ఈ ప్రచార ఉద్యమం లో భాగం గా దేశమంతటా పంచాయతీ/పల్లె, బ్లాకు, పట్టణ స్థానిక సంస్థ, రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయి లో అనేక కార్యక్రమాల ను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాల లో సర్వోన్నత త్యాగాన్ని చేసిన శూరులైన వ్యక్తుల కు హృదయ పూర్వకమైన కృతజ్ఞత ను వ్యక్తం చేయడం కోసం శిలాఫలకం (స్మారక చిహ్నం) యొక్క నిర్మాణం; ఆ శిలాఫలకం వద్ద ప్రజలు పంచ్ ప్రణ్ప్రతిజ్ఞ ను స్వీకరించడం; స్వదేశీ ప్రజాతుల కు చెందిన మొక్కల ను నాటి వాటి కి నీటిని అందించడం తో పాటు అమృత్ వాటిక’ (వసుధ వందన్) ను అభివృద్ధి పరచడం, స్వాతంత్య్ర సమరయోధుల మరియు అమరులైన స్వాతంత్య్ర యోధుల కుటుంబాల ను గౌరవించుకోవడం కోసం (వీరోన్ కా వందన్) అభినందన కార్యక్రమాలు వంటివి చోటు చేసుకొన్నాయి.

ఈ ప్రచార ఉద్యమం పెద్ద ఎత్తున సఫలం అయింది; దీని లో భాగం గా.. 36రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల లో 2.3 లక్షల కు పైచిలుకు శిలాఫలకాల ను నిర్మించడమైంది, సుమారు 4 కోట్ల పంచ్ ప్రణ్ప్రతిజ్ఞ స్వీకారం తాలూకు సెల్ఫీల ను అప్ లోడ్ చేయడమైంది, దేశవ్యాప్తం గా 2 లక్షల పైచిలుకు వీరోం కా వందన్కార్యక్రమాల నిర్వహించడమైంది, 2.36 కోట్ల కు పైగా స్వదేశీ మొక్కల ను నాటడం తో పాటుగా దేశమంతటా వసుధ వందన్ఇతివృత్తం లో భాగం గా 2.63 లక్షల అమృత్ వాటిక ల ను ఏర్పాటు చేయడం వంటి కార్యాలు పూర్తి అయ్యాయి.

మేరీ మాటీ మేరా దేశ్ప్రచార ఉద్యమం లో అమృత్ కలశ్ యాత్ర కూడా ఒక భాగం గా ఉంది; ఈ కార్యక్రమం లో గ్రామీణ ప్రాంతాల లో 6 లక్షల కు పైగా గ్రామాల నుండి మరియు పట్టణ ప్రాంతాల లోని వార్డుల నుండి మట్టి ని, ఇంకా బియ్యాన్ని సేకరించడమైంది. గ్రామాల మట్టి ని బ్లాకు స్థాయి లో కలిపివేసి, ఆ మట్టి ని రాష్ట్ర రాజధాని కి చేర్చడం జరిగింది. ఆ తరువాత వేల కొద్దీ అమృత్ కలశ్ యాత్రికుల తో రాష్ట్ర స్థాయి నుండి మట్టి ని దేశ రాజధాని కి పంపించడం జరుగుతుంది.

అమృత్ కలశ్ యాత్ర లో భాగం గా 2023 అక్టోబరు 30 వ తేదీ నాడు అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల కు ప్రాతినిధ్యం వహించే బ్లాకు మరియు పట్టణ స్థానిక సంస్థల కు చెందిన మట్టి నమూనాల ను ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్భావన ప్రస్ఫుటం అయ్యే విధం గా ఒక విశాలమైన అమృత్ కలశ్ లో నింపడం జరుగుతుంది. అక్టోబరు 31 వ తేదీ నాడు ప్రధాన మంత్రి దేశవ్యాప్తం గా ఈ కార్యక్రమం లో పాల్గొనే వేల కొద్దీ అమృత్ కలశ్ యాత్రికుల ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

దేశం లోని ప్రతి ఒక్క భాగం నుండి ఒక చోటు కు చేర్చే మట్టి ని కర్తవ్య పథ్ లో అమృత్ వాటిక మరియు అమృత్ మహోత్సవ్ మెమోరియల్ లను నిర్మించడాని కై ఉపయోగించడమైంది. ఈ అమృత్ వాటిక మరియు అమృత్ మహోత్సవ్ మెమోరియల్ లను ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్యొక్క ముగింపు కార్యక్రమం గా మేరీ మాటీ మేరా దేశ్ప్రచార ఉద్యమాన్ని సంకల్పించడమైంది. భారతదేశం స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని ఉత్సవం గా జరుపుకొనే క్రమం లో 2021 మార్చి నెల 12 వ తేదీ నాడు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ మొదలు పెట్టడమైంది. అటు తరువాత, దేశం లో అన్ని ప్రాంతాల లో ప్రజలు ఉత్సాహం గా పాలుపంచుకోవడం తో రెండు లక్షల కు పై చిలుకు కార్యక్రమాల ను నిర్వహించడం జరిగింది.

ఎమ్ వై భారత్

దేశం లో యువతీయువకుల కై ఒకే చోటు లో సంపూర్ణ ప్రభుత్వ వేదిక గా సేవల ను అందించడం కోసం ఒక స్వతంత్ర సంస్థ గా మేరా యువ భారత్ (మై భారత్ ) ను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దేశం లో ప్రతి ఒక్క యువతి కి, ప్రతి ఒక్క యువకుని కి సమానమైన అవకాశాల ను అందించాలన్న ప్రధాన మంత్రి దృష్టికోణాని కి అనుగుణం గా మై భారత్ సాంకేతిక విజ్ఞానాన్ని అండ గా తీసుకొంటూ ప్రభుత్వం లోని అన్ని విభాగాల లో ఒక సానుకూల యంత్రాంగాన్ని అందించేందుకు గాను ఉద్దేశించిడమైంది. దీని ద్వారా యువతీ యువకులు వారి ఆకాంక్షల ను నెరవేర్చుకోవడానికి తోడు వికసిత్ భారత్ఆవిష్కారాని కి వారి వంతు తోడ్పాటు ను అందించాలి అనేదే లక్ష్యం గా ఉంది. యువత సామాజిక పరివర్తన కు ప్రతినిధులు గా, జాతి నిర్మాణం లో పాత్రదారులు గా నిలవడం తోపాటు, ప్రభుత్వాని కి మరియు పౌరుల కు మధ్య యువ సేతువలె వ్యవహరించేటట్లు గా వారిని తీర్చిదిద్దాలని అనేది సైతం మై భారత్ యొక్క లక్ష్యం గా ఉంది. ఈ కోవ లో మై భారత్ అనేది దేశం లో యువత ప్రధాన స్థానం లో నిలచేటటువంటి అభివృద్ధి అనే ఆశయాని కి పెద్ద ప్రోత్సాహకాన్ని అందించనుంది.

 

***

 



(Release ID: 1973016) Visitor Counter : 115