ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియా పారాగేమ్స్‌ ‘జావెలిన్ త్రో ఎఫ్-55’ విభాగంలో కాంస్యం గెలిచిన టేక్‌చంద్ మహ్లావత్‌కు ప్రధాని అభినందన

Posted On: 28 OCT 2023 8:32PM by PIB Hyderabad

   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌ పురుషుల జావెలెన్ త్రో ఎఫ్‌-55 విభాగంలో కాంస్య పతకం గెలుచుకున్న టేక్‌చంద్ మహ్లావత్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. మహ్లావత్ ప్రతిభను కొనియాడుతూ- ఈ విజయం సంకల్ప బలానికి, శక్తి సామర్థ్యాలకు నిదర్శనమని, తద్వారా అతడు దేశం గర్వించే విజయం సాధించాడని వ్యాఖ్యానించారు.

మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“ఆసియా పారా గేమ్స్‌ పురుషుల జావెలిన్ త్రో ఎఫ్-55 విభాగంలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి కాంస్యం సాధించిన టేక్‌చంద్ మహ్లావత్‌కు నా అభినందనలు. అతని సంకల్పం బలం, నైపుణ్యం, శక్తిసామర్థ్యాలను ఈ విజయం ప్రతిబింబించింది. అలాగే ఇది మన దేశానికి ఎంతో గర్వకారణం” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(Release ID: 1972833) Visitor Counter : 126