ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా పారాగేమ్స్ భారత క్రీడాకారుల అసమాన ప్రతిభా ప్రదర్శనపై ప్రధాని ప్రశంసలు
నాడు పోస్టు చేయడమైనది:
28 OCT 2023 11:13PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా పారాగేమ్స్‌లో అసమాన ప్రతిభా ప్రదర్శనతో 111 పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రశంసించారు. అకుంఠిత పరిశ్రమ, మొక్కవోని సంకల్పంతో విజయాలు సాధించడం ద్వారా వారు దేశం గర్వించేలా చేశారని కొనియాడారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారాగేమ్స్‌లో భారత అసాధారణ ప్రతిభ దేశ పౌరులను ఉర్రూతలూగించింది! మొత్తం 111 పతకాలు సాధించి సరికొత్త రికార్డు సృష్టించిన మన క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు. ఈ ఘన విజయం మన క్రీడాకారుల అకుంఠిత దీక్షకు, అచంచల క్రీడా స్ఫూర్తికి నిదర్శనం” అని ప్రధానమంత్రి ప్రశంసలు కురిపించారు.
(రిలీజ్ ఐడి: 1972823)
సందర్శకుల సూచీ సంఖ్య : : 181
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam