ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియన్ పారా గేమ్స్ లో జావెలిన్ త్రోలో రజత పతకం గెలుచుకున్న ప్రదీప్ కుమార్ కు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
Posted On:
27 OCT 2023 5:46PM by PIB Hyderabad
హాంగ్ ఝూ ఆసియన్ పారా గేమ్స్ లో జావెలిన్ త్రో- F54 ఈవెంట్ లో రజత పతకం గెలుచుకున్న ప్రదీప్ కుమార్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
రాబోయే ఈవెంట్లలో కూడా అతను ఇలాంటి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అని తెలియచేశారు.
ఎక్స్ లో ప్రధానమంత్రి ఈ మేరకు ఒక సందేశం పోస్ట్ చేశారు.
‘‘ఆసియన్ పారా గేమ్స్ 2022లో జావెలిన్ త్రో- F54 ఈవెంట్ లో అద్భుతమైన రజత పతకం గెలుచుకున్న ప్రదీప్ కుమార్ కు అభినందనలు. రాబోయే క్రీడల్లో కూడా అతను ఇలాంటి విజయాలు సాధించాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1972456)
Visitor Counter : 104
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam