ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధాన మంత్రితాను అందుకొన్న జ్ఞాపికల వేలంపాట లో పాల్గొనవలసింది గా పౌరుల ను ఉత్సాహపరచారు
Posted On:
27 OCT 2023 1:54PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తాను అందుకొన్న జ్ఞాపిక ల వేలంపాట లో పౌరులు పాల్గొని, ఆ జ్ఞాపికల ను గెలుచుకోవడాని కి వారి వారి బిడ్ లను వేయవలసిందంటూ ఉత్సాహపరచారు. దీనిలో వచ్చే సొమ్ము ను నమామి గంగే కు ఇవ్వడం జరుగుతుంది అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.
ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -
‘‘నేను గత కొన్ని సంవత్సరాల లో అందుకొన్న జ్ఞాపికల వేలంపాట కు అపూర్వమైన స్థాయి లో వస్తున్న ప్రతిస్పందన ను చూసి నిజంగా చాలా సంతోషించాను. ఈ వేలం లో వచ్చే సొమ్ము ను నమామి గంగే కార్యక్రమాని కి ఇవ్వడం జరుగుతుందనే విషయం మీకు తెలిసిందే. నేను అందుకొన్నటువంటి కొన్ని మెమొంటో లను దక్కించుకోవడం కోసం ప్రతి ఒక్కరు ఈ వేలం లో పాల్గొనవలసిందిగాను మరి వారి వారి బిడ్ లను వేయవలసింది గాను అందరిని ప్రోత్సహిస్తున్నాను. pmmementos.gov.in/#/’’ అని పేర్కొన్నారు.
(Release ID: 1972054)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam