ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియన్ పారా గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్-క్లాస్ 4 ఈవెంట్ లో భావినా పటేల్ కాంస్య పతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి హర్షం
నాడు పోస్టు చేయడమైనది:
25 OCT 2023 1:29PM by PIB Hyderabad
చైనాలోని హాంగ్ ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్-క్లాస్ 4 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించిన భావినా పటేల్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఆయన ఈ మేరకు ఎక్స్ లో ఒక పోస్ట్ చేస్తూ
‘‘వర్థమాన అథ్లెట్లకు ఇది నిజమైన స్ఫూర్తి. టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్-క్లాస్ 4 ఈవెంట్ లో కాంస్య పతకం సాధించినందుకు భావినా పటేల్ కు అభినందనలు. ఆమె అసాధారణ ప్రతిభ, చెక్కు చెదరని కట్టుబాటు జాతికి అద్భుతమైన గర్వం తెచ్చాయి’’ అని పేర్కొన్నారు.
(రిలీజ్ ఐడి: 1971904)
సందర్శకుల సూచీ సంఖ్య : : 99
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada