నాడు పోస్టు చేయడమైనది:
26 OCT 2023 9:15PM by PIB Hyderabad
ఆసియా పారాగేమ్స్ మహిళల ‘200 మీటర్ల టి-12’లో రజతం సాధించిన సిమ్రాన్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అభినందించారు. భవిష్యత్తులోనూ ఆమె మరిన్ని విజయాలు సాధించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఆసియా పారా గేమ్స్ మహిళల ‘200 మీటర్ల టి-12’లో రజత పతకం సాధించడంలో అపూర్వ ప్రతిభ ప్రదర్శించిన సిమ్రాన్‌కు నా అభినందనలు. ఈ అద్భుత విజయాన్ని దేశం సగర్వంగా ఆస్వాదిస్తోంది. భవిష్యత్తులోనూ ఆమె విజయపథంలో దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.