ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

నేడు (అక్టోబ‌ర్ 27) ప్ర‌ధాన మంత్రి మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చిత్ర‌కూట్‌ సందర్శన


శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్ట్‌లో బహుళ కార్యక్రమాలలో పాల్గొనున్న ప్రధాన మంత్రి

రఘుబీర్ మందిర్‌లో పూజ, దర్శనం

దివంగత శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ శతాబ్ది జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని బహిరంగ కార్యక్రమంలో పాల్గొనున్న ప్రధాన మంత్రి

తులసి పీఠాన్ని కూడా సందర్శించనున్న ప్రధాన మంత్రి; కంచ మందిరంలో పూజ మరియు దర్శనం

Posted On: 26 OCT 2023 8:02PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు (అక్టోబర్ 27న) మధ్యప్రదేశ్‌లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1:45 గంటలకు, ప్రధానమంత్రి సత్నా జిల్లా చిత్రకూట్ కు చేరుకుంటారు.  శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్ట్‌లో పలు కార్యక్రమాలలో పాల్గొంటారు. రఘుబీర్ మందిర్‌లో మూర్తి దర్శనం, పూజలు చేస్తారు. శ్రీ రామ్ సంస్కృత మహావిద్యాలయాన్ని సందర్శిస్తారు. స్వర్గీయ శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులు అర్పించి, జానకి కుండ్ చికిత్సాలయ నూతన విభాగాన్ని ప్రారంభిస్తారు. 

స్వర్గీయ శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ శతాబ్ది జయంతి ఉత్సవాల సందర్భంగా జరిగే బహిరంగ కార్యక్రమానికి కూడా ప్రధాన మంత్రి హాజరవుతారు. శ్రీ సద్గురు సేవా సంఘ్ ట్రస్ట్‌ను 1968లో పరమ పూజ్య రామ్ చోద్ దాస్ జి మహారాజ్ స్థాపించారు. శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్, పరమ పూజ్య  రామ్ చోద్ దాస్ జి మహారాజ్ నుండి ప్రేరణ పొందారు. ట్రస్ట్ స్థాపనలో కీలక పాత్ర పోషించారు. స్వాతంత్య్రానంతర భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో శ్రీ అరవింద్ భాయ్ మఫత్‌లాల్ ఒకరు. దేశ అభివృద్ధి పథంలో శ్రీ అరవింద్ భాయ్ ది  కూడా కీలక పాత్ర ఉంది. 

చిత్రకూట్ పర్యటన సందర్భంగా ప్రధాని తులసీ పీఠాన్ని కూడా సందర్శిస్తారు. మధ్యాహ్నం 3:15 గంటలకు, అతను కంచ మందిర్‌లో పూజలు చేస్తారు. తులసి పీఠానికి చెందిన జగద్గురు రామానందాచార్యుల ఆశీర్వాదం పొంది, బహిరంగ సభకు హాజరవుతారు, అక్కడ ఆయన మూడు పుస్తకాలు- ‘అష్టాధ్యాయి భాష’, ‘రామానందాచార్య చరితం’, ‘భగవాన్ శ్రీ కృష్ణ కి రాష్ట్రలీల’లను విడుదల చేస్తారు.

తులసి పీఠ్ అనేది మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోని ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సామాజిక సేవా సంస్థ. దీనిని 1987లో జగద్గురు రామభద్రాచార్య స్థాపించారు. తులసి పీఠ్ హిందూ మత సాహిత్యం ప్రముఖ ప్రచురణకర్తలలో ఒకటి.

 

***


(Release ID: 1971790) Visitor Counter : 99