ప్రధాన మంత్రి కార్యాలయం

పారా ఆసియా క్రీడలు 2022లో షాట్‌పుట్ ఎఫ్-56/57 కేటగిరీ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని సాధించిన హోటోజే దేనా హొకాటోకి ప్రధాని అభినందనలు

Posted On: 25 OCT 2023 7:50PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్‌జౌలో జరిగిన ఆసియన్ పారా గేమ్స్ 2022లో షాట్‌పుట్ ఎఫ్-56/57 కేటగిరీ ఈవెంట్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న హోటోజే దేనా హొకాటోను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ప్రధాన మంత్రి X సామజిక మాధ్యమంలో పోస్ట్ చేస్తూ: “షాట్‌పుట్ ఎఫ్-56/57 విభాగంలో అద్భుతమైన కాంస్య పతకాన్ని సాధించిన హోటోజే దేనా హొకాటోకు అభినందనలు. అతని అద్భుతమైన స్ఫూర్తి, శక్తికి భారతదేశం గర్విస్తోంది. అతని మున్ముందు సాగే ప్రయాణం మరిన్ని అద్భుతమైన విజయాలతో పరిపూర్ణమవ్వాలని కోరుకుంటున్నాను." అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. (Release ID: 1971766) Visitor Counter : 49