హోం మంత్రిత్వ శాఖ
'పోలీసు అమర వీరుల సంస్మరణ దినం' సందర్భంగా న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించిన కేంద్ర హోం,సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా
‘పటిష్టమైన పోలీసు వ్యవస్థ లేకుండా ఏ దేశ అంతర్గత భద్రత లేదా సరిహద్దు భద్రత సాధ్యం కాదు‘
‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తూ, మోదీ మోడీ ప్రభుత్వం కఠినమైన చట్టాలను రూపొందించింది; పోలీసు వ్యవస్థ ఆధునీకరణ కోసం పోలీస్ టెక్నాలజీ మిషన్ ను ఏర్పాటు చేయడం ద్వారా, ప్రపంచంలోనే ఉత్తమ ఉగ్రవాద వ్యతిరేక శక్తిగా ఎదగడానికి ప్రయత్నాలు చేసింది‘
‘ఉగ్రవాదం, మిలిటెంట్ దాడులు, నక్సలిజం, జాతి హింస ఘటనలు గత దశాబ్దంలో 65 శాతం తగ్గాయి‘
‘మన క్రిమినల్ జస్టిస్ వ్యవస్థను సమూలంగా మార్చేందుకు మోదీ ప్రభుత్వం మూడు కొత్త చట్టాలను తీసుకువస్తోంది‘
‘ఈ మూడు కొత్త చట్టాలు బ్రిటిష్ కాలం నాటి చట్టాలను భర్తీ చేస్తాయి; భారతీయతను ప్రతిబింబిస్తాయి; భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి పౌరుడి హక్కులను పరిరక్షిస్తాయి‘
‘పోలీస్ టెక్నాలజీ మిషన్, మూడు కొత్త చట్టాలు ఇంకా ఐసిజెఎస్ ద్వారా క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లో పారదర్శకత , వేగాన్ని తీసుకురావాలనే లక్ష్యాన్ని సాధించడంలో మనం విజయం సాధిస్తాము‘
‘నేడు ప్రపంచంలోని అన్ని రంగాల్లో భారత్ పురోగమిస్తోంది; దాని పునాది అమరుల త్యాగం; వారి త్యాగాన్న
Posted On:
21 OCT 2023 2:01PM by PIB Hyderabad
' పోలీసు అమర వీరుల సంస్మరణ దినం‘ సందర్భంగా కేంద్ర హోం , సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలోని జాతీయ పోలీసు స్మారక చిహ్నం వద్ద పోలీసు అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, కేంద్ర హోంశాఖ కార్యదర్శి సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ అంతర్గత భద్రత, సరిహద్దుల భద్రత కోసం ప్రాణాలర్పించిన 36,250 మంది పోలీసులకు అమిత్ షా నివాళులు అర్పించారు. ఈరోజు భారతదేశం ప్రపంచంలోని అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని, దాని పునాది వారి అమరవీరుల త్యాగమని, వారి త్యాగాన్ని ఈ దేశం ఎన్నటికీ మరచిపోదని హోం మంత్రి అమర పోలీసుల కుటుంబాలనుద్దేశించి అన్నారు. పటిష్టమైన పోలీసు వ్యవస్థ లేకుండా ఏ దేశ అంతర్గత భద్రత లేదా సరిహద్దు భద్రత సాధ్యం కాదని శ్రీ షా అన్నారు. దేశానికి సేవలందించే సిబ్బందిలో పోలీసులది కఠినమైన ఉద్యోగమని, పగలు - రాత్రి, శీతాకాలం - వేసవి, పండుగ లేదా సాధారణ దినం అని లేకుండా పోలీసులకు తమ కుటుంబాలతో పండుగలను జరుపుకునే అవకాశం లేదని అన్నారు. మన పోలీసు దళాలన్నీ తమ జీవితాల్లోని విలువైన సంవత్సరాలు అన్నింటినీ తమ కుటుంబాలకు దూరంగా దేశ పొడవైన భూ సరిహద్దులో గడుపుతాయని, తమ ధైర్యసాహసాలు, త్యాగాలతో దేశాన్ని రక్షిస్తాయని ఆయన అన్నారు. ఉగ్రవాదులను ఎదుర్కోవడం, నేరాలను ఆపడం, జనసమూహాన్ని అదుపు చేస్తూ శాంతిభద్రతలను కాపాడటం, విపత్తులు, ప్రమాదాల సమయంలో సాధారణ పౌరులను రక్షించడం, కరోనా వంటి క్లిష్ట సమయాల్లో ముందు వరుసలో ఉండటం, పౌరులను రక్షించడం ఇలా ప్రతి సందర్భంలోనూ మన పోలీసులు తమను తాము నిరూపించుకున్నారని హోం మంత్రి అన్నారు. 2022 సెప్టెంబర్ 1 నుంచి 2023 ఆగస్టు 31 వరకు గత ఏడాది కాలంలో 188 మంది పోలీసులు దేశ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం విధుల నిర్వహణ సమయంలో ప్రాణత్యాగం చేశారని తెలిపారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అమృత్ కాల్ కు పిలుపు ఇచ్చారని, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన నాటి నుంచి శతజయంతి వరకు ఈ 25 ఏళ్లు దేశాన్ని అన్ని రంగాల్లో అగ్రస్థానానికి తీసుకెళ్లడమే అమృత్ కాల్ ఉద్దేశమని కేంద్ర హోం మంత్రి తెలిపారు. ఇందుకోసం దేశంలోని 130 కోట్ల మంది ప్రజలు సామూహికంగా, వ్యక్తిగతంగా ప్రతిజ్ఞ చేశారని, ఈ సంకల్పాలతో ప్రపంచంలోని ప్రతి రంగంలోనూ మనం ఉన్నత స్థానానికి చేరుకోకుండా ఎవరూ ఆపలేరని ఆన్నారు. గత దశాబ్దకాలంలో మన ధైర్యవంతులైన పోలీసుల కృషి వల్ల ఉగ్రవాదం, మిలిటెంట్ దాడులు, నక్సలిజం, జాతుల హింస పతాక స్థాయి నుంచి 65 శాతం తగ్గాయని శ్రీ షా అన్నారు.
గత కొన్నేళ్లుగా ఎన్ డి ఆర్ ఎఫ్ ద్వారా పనిచేస్తూ వివిధ పోలీసు బలగాలకు చెందిన సైనికులు గౌరవప్రదమైన పేరు సంపాదించుకున్నారని, విపత్తు నిర్వహణ రంగంలో దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విజయాలు సాధించారని శ్రీ అమిత్ షా అన్నారు. మనం భారత స్వాతంత్ర్య అమృత్ కాల్ లోకి ప్రవేశిస్తున్న తరుణంలో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం మూడు కొత్త చట్టాలను తీసుకువస్తోందని, ఇది మన క్రిమినల్ న్యాయ వ్యవస్థను పూర్తిగా మారుస్తాయని ఆయన అన్నారు. ఈ మూడు చట్టాలు 150 సంవత్సరాల బ్రిటిష్ కాలం నాటి చట్టాలను భర్తీ చేస్తాయని, భారతీయతను ప్రతిబింబించడమే కాకుండా భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ప్రతి పౌరుడి హక్కులను పరిరక్షిస్తాయని ఆయన అన్నారు. కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న కేసులను ముగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పెద్దపీట వేశారన్నారు. పోలీస్ టెక్నాలజీ మిషన్, మూడు కొత్త చట్టాలు, ఐసీజేఎస్ ద్వారా క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో పారదర్శకత, వేగాన్ని తీసుకురావాలన్న లక్ష్యాన్ని సాధించడంలో ప్రధాని మోదీ నాయకత్వంలో విజయం సాధిస్తామని చెప్పారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జీరో టాలరెన్స్ విధానాన్ని కొనసాగిస్తూ, మోదీ ప్రభుత్వం కఠినమైన చట్టాలను రూపొందించిందని, పోలీసుల ఆధునీకరణ కోసం పోలీస్ టెక్నాలజీ మిషన్ ను ఏర్పాటు చేయడం ద్వారా ప్రపంచంలోనే ఉత్తమ ఉగ్రవాద వ్యతిరేక శక్తిగా ఎదగడానికి ప్రయత్నాలు చేసిందని కేంద్ర హోం మంత్రి తెలిపారు. పోలీసు సిబ్బంది సంక్షేమం కోసం ఆయుష్మాన్- సి ఎ పి ఎఫ్ , హౌసింగ్ స్కీమ్, సి ఎ పి ఎఫ్ ఇ -ఆవాస్ వెబ్ పోర్టల్, ప్రైమ్ మినిస్టర్ స్కాలర్షిప్ స్కీమ్, సెంట్రల్ ఎక్స్గ్రేషియా, డిజేబిలిటీ ఎక్స్గ్రేషియా, ఎయిర్ కొరియర్ సర్వీసెస్, సెంట్రల్ పోలీస్ వెల్ఫేర్ స్టోర్ లో - ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సకాలంలో మార్పులు చేసిందని తెలిపారు.
పోలీసు స్మారక చిహ్నం కేవలం ప్రతీక మాత్రమే కాదని, దేశ నిర్మాణం కోసం మన పోలీసు సిబ్బంది త్యాగం, అంకితభావానికి ఇది గుర్తింపు అని శ్రీ అమిత్ షా అన్నారు. పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని
***
(Release ID: 1969806)
Visitor Counter : 96