ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వరల్డ్ నంబర్ వన్ శ్రీ మేగ్నస్ కార్ల్ సన్ తో పోటీ పడి గెలుపు ను సాధించినందుకుగాను శ్రీ కార్తికేయన్ మురళి కి ప్రశంసల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 19 OCT 2023 6:27PM by PIB Hyderabad

వరల్డ్ నంబర్ వన్ శ్రీ మేగ్నస్ కార్ల్ సన్ తో కతర్ మాస్టర్స్ 2023 ఈవెంట్ లో పోటీ పడి గెలుపు ను సాధించినందుకు గాను శ్రీ కార్తికేయన్ మురళి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ అందులో -

‘‘కతర్ మాస్టర్స్ 2023 లో రాణించినందుకు శ్రీ @KarthikeyanM64 కు ఇవే అభినందన లు. ఆయన యొక్క ఈ సాఫల్యం భారతదేశాన్ని ఎంతో గర్వపడేటట్లు చేసింది.

చదరంగం లో రాజ్యమే లుతున్నటువంటి విజేత మరియు వరల్డ్ నంబర్ వన్ క్రీడాకారుడు శ్రీ మేగ్నస్ కార్ల్ సన్ ను ఓడించిన అవిశ్వసనీయ కార్యాన్ని ఆయన సాధించారు.

ఆయన తన గొప్ప ఆట ను ఇలాగే కొనసాగిస్తూ ఉండు గాక మరి ఆట యొక్క తరువాతి విడత లోను, ఇంకా ఇతర పోటీల లోను ఆయన చక్కగా ఆడాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 


(रिलीज़ आईडी: 1969710) आगंतुक पटल : 140
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Malayalam