సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము


మహిళా సాధికారతకు మహిళలు దిక్సూచిగా మారడానికి వహీదా రెహ్మాన్ ఉదాహరణ: రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

కళాకారులు మార్పును సృష్టించేవారు, అత్యుత్తమ ప్రమాణాలను నెలకొల్పడం కొనసాగిస్తారు మరియు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిస్తారు: శ్రీమతి ముర్ము

ఏ కంటెంట్ ప్రాంతీయమైనది కాదు, మంచి ప్రాంతీయ కంటెంట్ ప్రపంచ ప్రేక్షకులను చేరుకుంటుంది:శ్రీ అనురాగ్ ఠాకూర్

పైరసీపై పోరాటంలో ప్రభుత్వం సినీ రంగానికి అండగా నిలుస్తుంది, త్వరలో ఏవిజీసీ విధానం: శ్రీ ఠాకూర్

Posted On: 17 OCT 2023 6:10PM by PIB Hyderabad

భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన వేడుకలో  వివిధ విభాగాల కింద 2021 సంవత్సరానికి జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీమతి వహీదా రెహమాన్‌కు ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి (ఐ&బి), శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్, ఐ&బి శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్, ఐ&బి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, జ్యూరీ చైర్‌పర్సన్‌లు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

శ్రీమతి వహీదా రెహ్మాన్‌ను రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము  అభినందించారు. ఆమె తన కళ మరియు వ్యక్తిత్వంతో చిత్ర పరిశ్రమలో శిఖరాగ్రంలో నిలిచారని అన్నారు. తన వ్యక్తిగత జీవితంలో కూడా ఆమె గౌరవం, ఆత్మవిశ్వాసం మరియు వాస్తవికత ఉన్న మహిళగా తనదైన ముద్ర వేసుకున్నారు. ఆమె చాలా చిత్రాల్లో ఎంచుకున్న పాత్రలు నిజ జీవితాన్ని స్పూరింపజేస్తాయి. అందులో ఆమె పాత్రలు సాధారణంగా మహిళలతో ముడిపడి ఉన్న అనేక అడ్డంకులను అధిగమించాయి. మహిళా సాధికారత కోసం మహిళలు కూడా చొరవ తీసుకోవాలని వహీదా జీ ఉదాహరణగా నిలిచారు అని తెలిపారు.

 

జాతీయ చలనచిత్ర అవార్డుల గురించి రాష్ట్రపతి మాట్లాడుతూ..ఈ అవార్డు వేడుక భారతదేశంలోని భిన్నత్వం మరియు దానిలో అంతర్లీనంగా ఉన్న ఏకత్వాన్ని చిత్రీకరిస్తుందని అన్నారు. ఈ వేడుకకు హాజరైన ప్రతిభావంతులైన వ్యక్తులు అనేక భాషలు, ప్రాంతీయ లక్షణాలు, సామాజిక విశ్వాసాలు, విజయాలు మరియు సమస్యలకు అర్థవంతమైన వ్యక్తీకరణను అందించారని, జాతీయ చలనచిత్ర అవార్డులలో అనేక తరాలు మరియు తరగతుల ప్రజలు ఒకచోట చేరారని ఆమె అన్నారు.

 

చలనచిత్ర సోదరులను మరియు కళాకారులను మార్పు-నిర్ణేతలు అని పిలుస్తూ వారు తమ చిత్రాల ద్వారా భారతీయ సమాజంలోని విభిన్న వాస్తవికతను సజీవంగా పరిచయం చేశారని అన్నారు. సినిమా అనేది మన సమాజానికి సంబంధించిన ఒక పత్రం మరియు దానిని మెరుగుపరచడానికి ఒక మాధ్యమం కూడా అని మరియు వారి పని ప్రజలను ఒకరితో ఒకరు అనుసంధానించిందని ఆమె తెలిపారు.

 

ప్రతిభ ఉన్న దేశంలో సినిమాతో అనుబంధం ఉన్న వ్యక్తులు ప్రపంచ స్థాయి శ్రేష్ఠతకు కొత్త ప్రమాణాలను నెలకొల్పడం కొనసాగిస్తారని మరియు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో చలనచిత్రాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని శ్రీమతి ముర్ము విశ్వాసం వ్యక్తం చేశారు.

 

కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ భారతీయ చలనచిత్ర పరిశ్రమ తనకు గర్వ కారణమని చెప్పారు. ఈ రోజు ఏదీ ప్రాంతీయమైనది కాదని కంటెంట్ బాగుంటే ప్రాంతీయ కంటెంట్ ప్రపంచ ప్రేక్షకులను చేరుకుంటుందని అన్నారు. లెజెండ్ శ్రీమతి వహీదా రెహ్మాన్ శ్రీ ఠాకూర్ గురించి మాట్లాడుతూ భారతీయ సినిమాలు అంతర్జాతీయ సరిహద్దులను దాటినందున, అదే విధమైన కీర్తి ఆమెకు కేటాయించబడిందన్నారు. ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించినందుకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

 

సినిమా పైరసీని అరికట్టేందుకు పరిశ్రమకు ప్రభుత్వం భుజం భుజం కలిపి నిలుస్తుందని, ఈ విపత్తును అరికట్టేందుకు సినిమాటోగ్రాఫ్ చట్టాన్ని తీసుకొచ్చామని మంత్రి  తెలియజేశారు. అదే క్రమంలో భారతదేశంలో ఏవిజీసీ రంగం యొక్క సంభావ్యత గురించి మంత్రి మాట్లాడారు. ప్రభుత్వం దానిపై ఒక విధానాన్ని తీసుకురాబోతోందని మరియు భారతదేశం 'ప్రపంచంలోని కంటెంట్ హబ్'గా దాని సామర్థ్యాన్ని గ్రహించడంలో సహాయపడుతుందని అన్నారు.

 

సెక్రటరీ శ్రీ అపూర్వ చంద్ర మాట్లాడుతూ సినిమా హాళ్లు మూతపడి పరిశ్రమ కష్టాల్లో కూరుకుపోయిన కోవిడ్ 19 సంవత్సర అయిన 2021 సంవత్సరానికి గాను అవార్డులను ప్రదానం చేస్తున్నామని చెప్పారు.  అయినప్పటికీ పరిశ్రమ త్వరితగతిన కోలుకుందని చెప్పారు. ఇప్పుడు దేశం మరియు చలనచిత్ర పరిశ్రమ రెండూ తిరిగి వృద్ధి బాటలో ఉన్నాయని చెప్పారు. గత త్రైమాసికం భారతదేశ చలనచిత్ర పరిశ్రమకు ఉత్తమమైనదన్నారు. బాక్సాఫీస్ విజయం ముఖ్యం అయితే ఫిల్మ్ అవార్డులు నాణ్యతను జరుపుకుంటాయని ఆయన అన్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్వీకరించినందుకు శ్రీమతి వహీదా రెహమాన్‌కు శ్రీ చంద్ర కృతజ్ఞతలు తెలిపారు.

 

అవార్డుల పూర్తి జాబితా క్రింది లింక్‌లో చూడవచ్చు

https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1951758

 


 

 

 

 

 

 

 

 

****



(Release ID: 1968946) Visitor Counter : 43