ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియాలోని నాగపట్నం నుంచి శ్రీలంకలోనికనకేసంతురై కి ఫెర్రీ సర్వీసును ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.


‘‘ఇండియా- శ్రీలంకలు దౌత్యపరమైన, ఆర్థికసంబంధాల విషయంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతున్నాయి.’’

‘‘ఫెర్రీ సర్వీసు చారత్రక, సాంస్క్రుతిక అనుబంధాలనుప్రత్యక్షంగా తీసుకువస్తుంది’’

‘‘ ఈ అనుసంధానత కేవలం రెండు నగరాలను మరింత దగ్గర చేయడమేకాక, మన రెండు దేశాలను, ఇరుదేశాల ప్రజలువారి హృదయాలను మరింత సన్నిహితం చేస్తుంది’’

‘‘ప్రగతి, అభివ్రుద్ధి కోసం భాగస్వామ్యంఅనేది, భారత –శ్రీలంక ద్వైపాక్షికసంబంధాల విషయంలో బలమైన అంశం’’

‘‘ భారతదేశసహాయంతో శ్రీలంకలో అమలుచేస్తున్న ప్రాజెక్టులు , అక్కడి ప్రజల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేశాయి’ :

Posted On: 14 OCT 2023 8:58AM by PIB Hyderabad

-ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశంలోనినాగపట్టణం నుంచి శ్రీ లంకలోని కనకేసంతురై కి ఫెర్రీ సర్వీసు ప్రారంభోత్సవకార్యక్రమంలో వీడియో సందేశమిచ్చారు.  ఈ కార్యక్రమానికి హాజరైన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ప్రధానమంత్రి, ఇండియా,శ్రీలంకలు దౌత్య, ఆర్థిక సంబంధాలలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావడంలో , నాగపట్నం, కనకేసంతురైలమధ్య ఫెర్రీ సర్వీసు ప్రారంభం  ఒక కీలకమైలురాయిగా నిలుస్తుందని అన్నారు. 

ఇరు దేశాల మధ్య ఉమ్మడి చరిత్ర, సంస్కృతి,నాగరికత గురించి ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.  భారత్ లోని నాగపట్నం, దాని పరిసర పట్టణాలు పలు ఇతర దేశాలతో నౌకా వాణిజ్యం కలిగి ఉన్నాయని అన్నారు. ప్రాచీన తమిళ సాహిత్యంలో  శ్రీలంకతో వాణిజ్య సంబంధాలు, చారిత్రక నౌకాకేంద్రమైన పూంపుహార్ ల ప్రస్తావన కనిపిస్తాయని ప్రధానమంత్రి తెలిపారు. 

సంగం కాల సాహిత్యంలో పట్టినప్పాలై, మణిమేకలై వంటివి రెండు దేశాలమధ్య పడవలు, నౌకల గురించిన ప్రస్తావన చేశాయని చెప్పారు. ప్రముఖ తమిళ కవి సుబ్రమణ్య భారతి , సింధు నదియిని మిసాయి , ఇండియా, శ్రీలంక ను అనుసంధానం చేసే బ్రిడ్జిని ప్రస్తావించింది. ఇప్పుడు ప్రారంభమవుతున్న ఫెర్రీ  ఆ చారిత్రక, సాంస్క్రుతిక సంబంధాలను మళ్లీ మనముందుకు తీసుకు వస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

ఇటీవల శ్రీలంక అధ్యక్షుడు విక్రమ సింఘే పర్యటన సందర్భంగా, అనుసంధానత ముఖ్యాంశంగా ఆర్థిక భాగస్వామ్యానికి సంబంధించిన సంయుక్త దార్శనిక పత్రాన్ని  చేపట్టినట్టు ప్రధానమంత్రి తెలిపారు. ‘‘అనుసంధానత, రెండు నగరాలను మరింత సన్నిహితం చేయడం మాత్రమే కాక, ఇది రెండు దేశాలను , ఇరు దేశాల ప్రజలను, ప్రజల మనసులను సన్నిహితం చేస్తోంది’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోది తెలిపారు. 

అనుసంధానత వాణిజ్యం, పర్యాటకం, ప్రజలకు –ప్రజలకు మధ్య సంబంధాలను పెంపొందిస్తాయని, ఇది ఇరు దేశాలలోని యువతకు నూతన ఉపాధి అవకాశాలు కల్పిస్తుందని అన్నారు.ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ 2015లో తాను శ్రీలంకలో జరిపిన పర్యటన గురించి ప్రస్తావించారు. అప్పుడు ఢిల్లీ, కొలంబో మధ్య నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించినట్టు చెప్పారు. అనంతరం, శ్రీలంకనుంచి యాత్రాస్థలమైన కుషినగర్ కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు ప్రారంభమైన విషయం కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. చెన్నై, జాఫ్నాల మధ్య 2019లో నేరుగా విమాన సర్వీసులు ప్రారంభమైన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇప్పుడు నాగపట్టణం- కనకేసంతురై మధ్య  ప్రారంభమైన ఫెర్రీ సర్వీసు ఈ దిశగా మరో ముందడుగుగా చెప్పుకోవచ్చు.‘‘ అనుసంధానతకు సంబంధించి మన దార్శనికత రవాణా రంగాన్ని మించి మరింత ముందుకు చూస్తుంద‘‘ని ప్రధానమంత్రి అన్నారు. 

ఇండియా‘-శ్రీలంక లు ఫైన్ టెక్, ఇంధన రంగంతో పాటు ఎన్నో విస్త్రుత అంశాలపై సన్నిహిత సంబంధాలుకలిగి ఉన్నాయని అన్నారు. డిజిటల్ చెల్లింపులు ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారిందని,యుపి ఐ  కారణంగా  ఇది ఇండియాలో ఒక జీవన విధానంగా మారిందని అన్నారు. ఇండియా, శ్రీలంక ప్రభుత్వాలు రెండూ, యుపిఐని, లంక పే అనుసంధానించడం ద్వారా ఫైన్ టెక్ రంగ అనుసంధానత పై క్రుషి చేస్తున్నాయని ఆయన అన్నారు.  అలాగే ఇంధన గ్రిడ్లను అనుసంధానించే అంశంపై కూడాప్రధానమంత్రి మాట్లాడారు. దీనితో ఇరు దేశాలమధ్య ఇంధన భద్రత, నమ్మకమైన సరఫరాకు ఇదివీలు కల్పిస్తుందని అన్నారు. ఇంధన భద్రత ఇండియా, శ్రీలంక దేశాల అభివ్రుద్ధి ప్రస్థానానికి కీలకమైనదని కూడా ప్రధానమంత్రి అన్నారు.

శ్రీలంక ఉత్తర ప్రావిన్స్లో గృహనిర్మాణం, నీటిసరఫరా, ఆరోగ్యం, జీవనోపాధికి మద్దతుకు సంబంధించిన పలు ప్రాజెక్టులు
పూర్తి అయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు. కనకేసంతురై హార్బర్ ఉన్నతీకరణు కూడా మద్దతు నిస్తున్నామని ఇది ఆనందం కలిగించే అంశమని చెప్పారు.
‘‘శ్రీలంక ఉత్తర ప్రాంతం నుంచి దక్షిణ ప్రాంతానికి రైల్వే లైన్ల పునరుద్ధరణ, జాఫ్నా సాంస్కృతిక కేంద్ర నిర్మాణం,
శ్రీలంక వ్యాప్తంగా అంబులెన్స్ సర్వీసులు, డిక్ ఒయా వద్ద మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి వంటి వాటి విషయంలో మేం సబ్ కా సాథ్,
సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ దార్శనికతతో పనిచేస్తున్నామ’’ని ప్రధానమంత్రి అన్నారు.
ఇటీవల భారత్ అధ్యక్షతన జరిగిన  జి 20 శిఖరాగ్ర సమ్మేళనం గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, భారత దేశ దార్శనికత అయిన వసుధైక కుటుంబకం భావనకు
అంతర్జాతీయ సమాజం నుంచి మద్దతు లభించినట్టు చెప్పారు. ఈ దార్శనికతలో ఒక భాగం, ప్రగతిఫలాలు, సుసంపన్నత ఫలాలను
ఇరుగు పొరుగు దేశాలతో పంచుకోవడానికి ప్రాధాన్యతనిస్తున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
జి 20 శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా ప్రారంభమైన ఇండియా – మధ్య ప్రాచ్యం– యూరప్ ఆర్ధిక కారిడార్
గురించి ప్రస్తావిస్తూ ప్రధానమంద్రి, ఇది ఒక ముఖ్యమైన అనుసంధానతా కారిడార్  అని చెప్పారు. ఇది ఈ ప్రాంతంపై పెద్ద ఎత్తున ఆర్ధిక ప్రభావాన్ని చూపుతుందని చెప్పారు.
మన రెండు దేశాలమధ్య బహుళ పక్ష అనుసంధానతను బలోపేతం చేయడం వల్ల శ్రీలంక ప్రజలు కూడా ఎంతో ప్రయోజనం పొందుతారని చెప్పారు.
ఈరోజు విజయవంతంగా ఇండియా –శ్రీలంక ల మధ్య ఫెర్రీ సర్వీసు ప్రారంభించుకుంటున్నందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , శ్రీలంక అధ్యక్షుడికి
ధన్యవాదాలు తెలిపారు. రామేశ్వరం–తలైమన్నార్ ల మధ్య కూడా ఫెర్రీ సర్వీసును పునరుద్ధరించే విషయంపై కూడా కృషి కొనసాగుతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. “ ఇరుదేశాల ప్రజల ప్రయోజనం కోసం , ఇండియా – శ్రీలంకల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత
 బలోపేతం చేసేందుకు,     శ్రీలంకతో  సన్నిహితంగా కలిసి  పనిచేసేందుకు ఇండియా కట్టుబడి ఉందని, ప్రధానమంత్రి అన్నారు.



(Release ID: 1967822) Visitor Counter : 83