ప్రధాన మంత్రి కార్యాలయం
ఫిడే ప్రపంచ జూనియర్ ర్యాపిడ్ చెస్ విజేత రౌనక్ సాధ్వానీకి ప్రధానమంత్రి అభినందన
प्रविष्टि तिथि:
14 OCT 2023 1:55PM by PIB Hyderabad
ఫిడే ప్రపంచ జూనియర్ ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్-2023లో అద్భుత విజయం సాధించిన రౌనక్ సాధ్వానీకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఫిడే ప్రపంచ జూనియర్ ర్యాపిడ్ చెస్ చాంపియన్ షిప్-2023లో అద్భుత విజయం సాధించినందుకు రౌనక్ సాధ్వానీ @sadhwani2005కి నా అభినందనలు! అతని వ్యూహాత్మక మేధస్సు, నైపుణ్యం ప్రపంచాన్ని అబ్బురపరచి, భారతదేశం గర్వపడేలా చేశాయి. అతడు మరిన్ని మెరుపు విజయాలతో దేశ యువతరానికి స్ఫూర్తిప్రదాతగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాను. భవిష్యత్తులోనూ అతని ప్రతిభ కాంతులీనాలని కోరుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 1967799)
आगंतुक पटल : 98
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam