ప్రధాన మంత్రి కార్యాలయం
ఎన్నో ఏళ్ల తర్వాత మళ్లీ పార్వతీకుండ్.. జగేశ్వర్ ఆలయాల సందర్శన నాకెంతో ప్రత్యేకం: ప్రధానమంత్రి
Posted On:
14 OCT 2023 11:52AM by PIB Hyderabad
ఉత్తరాఖండ్‌లోని కుమావో ప్రాంతంలోగల పార్వతీకుండ్, జగేశ్వర్ దేవాలయాలు తప్పక సందర్శించాల్సిన పుణ్యక్షేత్రాలుగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూచించారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఉత్తరాఖండ్‌లో తప్పక చూడాల్సిన ప్రదేశం ఏదని నన్నెవరైనా అడిగితే- రాష్ట్రంలోని కుమావో ప్రాంతంలోగల పార్వతీ కుండ్, జగేశ్వర్ ఆలయాల గురించి నేను ప్రస్తావిస్తాను. ఇక్కడి ప్రకృతి రమణీయత, దివ్యభావన మిమ్మల్ని మంత్రముగ్ధులను చేసి, ఆనంద లోకానికి తీసుకెళ్లడం తథ్యం. ఉత్తరాఖండ్‌లో అనేక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు ఉన్నాయన్నది నిజమే! ఈ రాష్ట్రంలో నేను తరచూ పర్యటిస్తూంటాను కూడా. వీటిలో కేదార్‌నాథ్, బద్రీనాథ్ పవిత్ర స్థలాలూ ఉన్నాయి. ఇవన్నీ చిరస్మరణీయ అనుభవాలు. అయితే, చాలా ఏళ్ల తర్వాత నేను పార్వతీ కుండ్, జగేశ్వర్ ఆలయాలకు మళ్లీ రావడం నాకెంతో ప్రత్యేకం” అని ప్రధానమంత్రి తన్మయత్వంతో పేర్కొన్నారు.
****
(Release ID: 1967650)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam