ప్రధాన మంత్రి కార్యాలయం

ఇజ్ రాయిల్ప్రధాని తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ఇజ్ రాయిల్ లో ఉగ్రవాదుల దాడి పర్యవసానం గా చనిపోయినవారి కి సంతాపాన్ని మరియు గాయపడిన వారి కి సానుభూతిని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

ఈ కష్ట కాలం లో భారతదేశం ప్రజానీకం ఇజ్ రాయిల్ కుసంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపిన ప్రధాన మంత్రి

ఉగ్రవాదాన్ని భారతదేశం దృఢం గా మరియు సందిగ్ధానికి తావు లేకుండా ఖండిస్తోందని పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి

ఇజ్ రాయిల్ లో ఉంటున్న భారతదేశ పౌరుల కు సురక్ష మరియుభద్రత కల్పిస్తామంటూ ప్రధాన మంత్రి కి హామీ ని ఇచ్చిన ప్రధాని శ్రీ నెతన్యాహు

Posted On: 10 OCT 2023 5:09PM by PIB Hyderabad

ఇజ్ రాయిల్ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న ఫోన్ లో మాట్లాడారు.

ఇజ్ రాయిల్ లో ఉగ్రవాద దాడుల ఫలితం గా ప్రాణాల ను కోల్పోయిన వారి కి ప్రధాన మంత్రి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆ దాడుల లో గాయపడ్డ వ్యక్తుల కు సానుభూతి ని తెలియ జేశారు. ఈ కష్ట కాలం లో ఇజ్ రాయిల్ కు భారతదేశం ప్రజానీకం సంఘీభావాన్ని వ్యక్తం చేస్తున్నట్లు ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

ఉగ్రవాదాన్ని దాని అన్ని రూపాల లో మరియు చేష్టల లో భారతదేశం దృఢం గా, సందిగ్ధాని కి తావు లేకుండా ఖండిస్తున్నదని ఆయన పునరుద్ఘాటించారు.

ఇజ్ రాయిల్ లో ఉంటున్న భారతదేశ పౌరుల సురక్ష ను మరియు భద్రత ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. ఈ విషయం లో సమర్థన ను మరియు పూర్తి సహకారాన్ని అందించడం జరుగుతుందంటూ ప్రధాని శ్రీ నెతన్యాహు హామీ ని ఇచ్చారు.

నేత లు ఇరువురు తరచు గా సంప్రదింపుల ను కొనసాగించుకోవాలని సమ్మతి ని వ్యక్తం చేశారు.

 

***



(Release ID: 1966635) Visitor Counter : 74