ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల పురుషుల చెస్లో భారత జట్టు రజతం సాధించడంపై ప్రధానమంత్రి అభినందన
Posted On:
07 OCT 2023 10:04PM by PIB Hyderabad
ఆసియా క్రీడల చదరంగం పురుషుల విభాగంలో భారత జట్టు రజత పతకం సాధించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:
“అద్భుత మేధస్సుకు ఇదో నిదర్శనం! ఆసియా క్రీడల చదరంగంలో భారత పురుషుల జట్టు రజత పతకం సాధించడంపై నా హృదయపూర్వక అభినందనలు. భవిష్యత్తులోనూ వారు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
**********
DS/ST
(Release ID: 1965740)
Visitor Counter : 123
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam