ప్రధాన మంత్రి కార్యాలయం
అక్టోబర్ 3న చత్తీస్‌గఢ్, తెలంగాణా రాష్ట్రాలలో ప్రధాన మంత్రి పర్యటన
నగర్నార్ వద్ద ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ కి చెందిన స్టీల్ ప్లాంట్‌ను జాతికి అంకితం చేయనున్న ప్రధాన మంత్రి; 23,800 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన ఈ ప్రొజెక్టు వల్ల ప్రపంచ ఉక్కు పటంలో ప్రముఖ స్థానానికి చేరుకోనున్న బస్తర్
జగదల్‌పూర్ రైల్వే స్టేషన్ అప్‌గ్రేడేషన్‌కు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి.
ఛత్తీస్‌గఢ్‌లో బహుళ రైలు, రోడ్డు ప్రాజెక్టులకు శంకుస్థాపన, జాతికి అంకితం చేయనున్న ప్రధాన మంత్రి
తెలంగాణలో దాదాపు రూ.8000 కోట్ల విలువైన ప్రాజెక్టులను జాతికి అంకితం, శంకుస్థాపన చేయనున్నారు
ఎన్టీపిసి కి చెందిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ 800 మెగావాట్ యూనిట్‌ను అంకితం చేయనున్న ప్రధాని ; వివిధ రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు కూడా జాతికి అంకితం
తెలంగాణ వ్యాప్తంగా ప్రధాన మంత్రి - ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద నిర్మించనున్న
20 క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు శంకుస్థాపన చేయనున్న ప్రధాన మంత్రి
Posted On:
02 OCT 2023 10:12AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబర్ 3- మంగళవారం నాడు చత్తీస్‌గఢ్, తెలంగాణలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు బస్తర్‌లోని జగ్దల్‌పూర్‌లో ప్రధాన మంత్రి ఛత్తీస్‌గఢ్ కి చెందిన రూ. 26,000 కోట్ల పైగా బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. జాతికి అంకితం చేస్తారు. నగర్నార్ వద్ద ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ స్టీల్ ప్లాంట్ ను కూడా ఆయన జాతికి అంకితం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని తెలంగాణలోని నిజామాబాద్‌కు చేరుకుంటారు. అక్కడ విద్యుత్, రైలు, ఆరోగ్యం వంటి ముఖ్యమైన రంగాలలో సుమారు 8000 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు.
ఛత్తీస్‌గఢ్‌లో ప్రధాని
ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు పెద్ద ఊపును అందించే దిశగా బస్తర్ జిల్లాలోని నగర్నార్ వద్ద ఎన్ఎండిసి స్టీల్ లిమిటెడ్ కి చెందిన స్టీల్ ప్లాంట్‌ను ప్రధాని జాతికి అంకితం చేస్తారు. రూ. 23,800 కోట్లకు పైగా ఖర్చుతో నిర్మించిన ఈ స్టీల్ ప్లాంట్ గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్, ఇది నాణ్యమైన ఉక్కును ఉత్పత్తి చేస్తుంది. నాగర్నార్‌లోని ఎన్ఎండిసి స్టీల్ ప్లాంట్‌తో పాటు అనుబంధ, దిగువ పరిశ్రమలలో వేలాది మందికి ఉపాధి అవకాశాలను అందిస్తుంది. ఇది బస్తర్‌ను ప్రపంచ ఉక్కు పటంలో ఉంచుతుంది. ఈ ప్రాంతంసామాజిక ఆర్థిక అభివృద్ధికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
దేశవ్యాప్తంగా రైలు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా, ఈ కార్యక్రమంలో బహుళ రైలు ప్రాజెక్టులకు శంకుస్థాపన జాతికి అంకితం చేయడం జరుగుతుంది. అంతఘర్- తరోకి మధ్య కొత్త రైలు మార్గాన్ని, జగదల్‌పూర్, దంతేవాడా మధ్య రైలు మార్గాన్ని డబ్లింగ్ చేసే ప్రాజెక్టును ప్రధాన మంత్రి జాతికి అంకితం చేస్తారు. బోరిదండ్-సూరజ్‌పూర్ రైల్ లైన్ డబ్లింగ్ ప్రాజెక్ట్, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద జగదల్‌పూర్ స్టేషన్ పునరాభివృద్ధికి ఆయన శంకుస్థాపన చేస్తారు. తరోకి - రాయ్‌పూర్ డెము రైలు సర్వీస్‌ను కూడా ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ రైలు ప్రాజెక్టులు రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలలో కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. ఈ ప్రాంతం ఆర్థికాభివృద్ధికి సహాయపడుతుంది.
జాతీయ రహదారి-43లోని ‘కుంకూరి నుండి ఛత్తీస్‌గఢ్ - జార్ఖండ్ సరిహద్దు విభాగం’ వరకు రోడ్డు అప్‌గ్రేడేషన్ ప్రాజెక్ట్‌ను కూడా ప్రధాని జాతికి అంకితం చేస్తారు. కొత్త రహదారి కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది, ఈ ప్రాంత ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది.
తెలంగాణలో ప్రధానమంత్రి
దేశంలో మెరుగైన ఇంధన సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తిని పెంచాలనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా, ఎన్టిపిసి తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మొదటి 800 మెగావాట్ల యూనిట్‌ను జాతికి అంకితం చేయనున్నారు. ఇది తెలంగాణకు తక్కువ ధరకే విద్యుత్‌ను అందించడంతోపాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుంది. దేశంలోని అత్యంత పర్యావరణ అనుకూల పవర్ స్టేషన్‌లలో ఇది ఒకటిగా కూడా ఉంటుంది. మనోహరాబాద్, సిద్దిపేటలను కలుపుతూ కొత్త రైల్వే లైన్‌తో సహా ధర్మాబాద్ - మనోహరాబాద్, మహబూబ్ నగర్ - కర్నూలు మధ్య విద్యుద్దీకరణ ప్రాజెక్ట్ వల్ల తెలంగాణ రైలు మౌలిక సదుపాయాలు ఊపందుకోనున్నాయి; 76 కి.మీ పొడవైన మనోహరాబాద్-సిద్దిపేట రైలు మార్గం ఈ ప్రాంతం సామాజిక-ఆర్థిక అభివృద్ధికి, ముఖ్యంగా మెదక్, సిద్దిపేట జిల్లాలలో అభివృద్ధి చెందుతుంది. ధర్మాబాద్-మనోహరాబాద్, మహబూబ్‌నగర్-కర్నూల్ మధ్య విద్యుద్దీకరణ ప్రాజెక్ట్ రైళ్ల సగటు వేగాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఈ ప్రాంతంలో పర్యావరణ అనుకూల రైలు రవాణాకు దారి తీస్తుంది. సిద్దిపేట - సికింద్రాబాద్ - సిద్దిపేట రైలు సర్వీసును కూడా ప్రధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించనున్నారు, ఈ ప్రాంతంలోని స్థానిక రైలు ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుతుంది. తెలంగాణాలో ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంపొందించే ప్రయత్నంలో, ప్రధాన మంత్రి - ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద రాష్ట్రవ్యాప్తంగా 20 క్రిటికల్ కేర్ బ్లాక్‌లకు (సీసీబి) ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, హైదరాబాద్, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, మహబూబ్ నగర్ (బాదేపల్లి), ములుగు, నాగర్‌కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి (మహేశ్వరం) సూర్యాపేట, పెద్దపల్లి, వికారాబాద్, వరంగల్ (నర్సంపేట) జిల్లాల్లో ఈ సీసీబీలను నిర్మించనున్నారు. . ఈ సీసీబీలు రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం చేకూర్చే విధంగా తెలంగాణ అంతటా జిల్లా స్థాయి క్రిటికల్ కేర్ మౌలిక సదుపాయాలను పెంచుతాయి.
(Release ID: 1963174)
Visitor Counter : 171
Read this release in:
Marathi
,
Odia
,
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam