ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

తేజీందర్ పాల్ సింగ్ తూర్ అద్భుత ప్రతిభకు ప్రధాని ప్రశంసలు పురుషుల షాట్ పుట్లో స్వర్ణం సాధించిన తేజీందర్

నాడు పోస్టు చేయడమైనది: 01 OCT 2023 8:29PM by PIB Hyderabad

   చైనాలోని హాంగ్‌ఝౌలో నిర్వహిస్తున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుడు తేజీందర్‌ పాల్‌ సింగ్‌ తూర్‌ షాట్‌ పుట్‌ త్రోలో స్వర్ణ పతకం కైవసం చేసుకోవడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ‘ఎక్స్‌’ పోస్ట్ ద్వారా పంపిన ఒక సందేశంలో:

“తేజీందర్‌ పాల్‌ సింగ్‌ అత్యుత్తమ ప్రదర్శనకు మరెవరూ సాటిరారు! ఆసియా క్రీడల షాట్‌ పుట్‌ త్రోలో వరుస స్వర్ణం సాధించిన అతనికి నా అభినందనలు. అతని క్రీడా నైపుణ్యం మనందర్నీ అబ్బురపరచింది. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని ఘన విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/ST


(రిలీజ్ ఐడి: 1963056) సందర్శకుల సూచీ సంఖ్య : : 138