ప్రధాన మంత్రి కార్యాలయం
ఆసియా క్రీడల ‘ఐఎల్‌సిఎ4'-డింగీ బాలికల విభాగంలో రజతం సాధించిన నేహా ఠాకూర్‌కు ప్రధాని అభినందన
Posted On:
26 SEP 2023 6:02PM by PIB Hyderabad
ఆసియా క్రీడల ‘ఐఎల్‌సిఎ4'-డింగీ బాలికల విభాగంలో రజత పతకం కైవసం చేసుకున్న నేహా ఠాకూర్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో: న్న
“అంకిత భావానికి, పట్టువీడని దీక్షకు ఇది ఉజ్వల ఉదాహరణ! మన నేహా ఠాకూర్ ‘ఐఎల్‌సిఎ4'-డింగీ బాలికల విభాగంలో రజత పతకం కైవసం చేసుకుంది. ఈ అద్భుత ప్రదర్శన ఆమె కఠోర పరిశ్రమకు, ప్రతిభకు ఒక నిదర్శనం. ఈ మేరకు ఆమెను అభినందించి, ఆశీర్వదిస్తూ, భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1961148)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam