ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

గోవా లోని అగౌడా ఫోర్ట్ లో ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ ప్రారంభం కావడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 24 SEP 2023 10:32PM by PIB Hyderabad

లైట్ హౌస్ లను కీలకమైన పర్యాటక స్థలాలు గా భావిస్తున్న ప్రజల లో వాటిని సందర్శించాలి అనేటటువంటి ఉత్సాహం అంతకంతకు పెరుగుతూ ఉండడం చూసి తనకు సంతోషం కలుగుతోందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఓడరేవు లు, శిపింగ్ మరియు జలమార్గాల శాఖ కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ ఎక్స్ లో అనేక ట్వీట్ లలో తాను గోవా ముఖ్యమంత్రి డాక్టర్ శ్రీ ప్రమోద్ పి సావంత్ మరియు కేంద్ర సహాయ మంత్రి శ్రీ శ్రీపద్ వై నాయిక్ లతో కలసి గోవా లోని అగౌడా పోర్ట్ లో మొట్టమొదటి ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ ను ప్రారంభించినట్లు వెల్లడించారు.

సముద్ర యానం లో ఒక అనివార్య భాగం గా ఉన్నటువంటి లైట్ హౌస్ ల యొక్క ప్రాముఖ్యాన్ని ఒక ఉత్సవం మాదిరి గా జరుపుకోవడం కోసం ఇండియన్ లైట్ హౌస్ ఫెస్టివల్ ను నిర్వహించడం జరుగుతున్నది. ఈ అద్వితీయమైనటువంటి మౌలిక సదుపాయాలు వాటి రహస్య మరియు ప్రాకృతిక సౌందర్యం తో ప్రాచీన కాలం నుండి నౌకల ను మరియు పర్యటకుల ను ఆకర్షిస్తూ వస్తున్నాయి.

కేంద్ర మంత్రి ఎక్స్ లో పొందుపరచిన ఒక పోస్ట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

‘‘ హౌసు లు కీలకమైన పర్యటక స్థలాలు అనేటటువంటి బావన ప్రజల లో వృద్ధి చెందుతూ ఉండడం చూసి సంతోషం వేసింది. ఇదే అంశం పై #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం లో నేను చెప్పిన మాటల ను

https://youtu.be/kP_qEIipwqE?si=-_wpXAj5aoIdSXls”ను సందర్శించి, గమనించవచ్చును.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST

 

 


(Release ID: 1960462) Visitor Counter : 123