సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
భారత్ జి 20 అధ్యక్షతపై పీపుల్స్ జి 20 పేరిట ఇ-పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీ అపూర్వ చంద్ర
Posted On:
18 SEP 2023 4:08PM by PIB Hyderabad
భారత్ జి 20 అధ్యక్షతపై పీపుల్స్ జి 20 అన్న ఇ- పుస్తకాన్ని సమాచార& ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర న్యూఢిల్లీలో సోమవారం ఆవిష్కరించారు. పుస్తకాన్ని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్ శ్రీ మనీష్ దేశాయ్, ఐ&బి మంత్రిత్వశాఖ, పిఐబి సీనియర్ అధికారుల సమక్షంలో విడుదల చేశారు.
భారతదేశపు జి20 అధ్యక్షతకు సంబంధించిన సంపూర్ణ ప్రయాణాన్ని ఈ పుస్తకం అందిస్తుంది. సెప్టెంబర్ 9-10, 2023 మధ్య న్యూఢిల్లీలో జరిగిన ప్రతిష్టాత్మక జి 20 గురించిన వివరణ మొదటి భాగంగా, పుస్తకంలో మూడు భాగాలు ఉంటాయి. భారత్ అధ్యక్షత కింద తీసుకున్న చొరవలను వివరిస్తూ, జి20 వ్యవస్థ, నిర్మాణాన్ని పనితీరును ఈ పుస్తకం సంగ్రహంగా వివరిస్తుంది.
ఇందులో రెండవ భాగంలో భారతదేశం అధ్యక్షత బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా జరిగిన ఎంగేజ్‌మెంట్ గ్రూపుల సమావేశాలతో పాటు షెర్పా కింద వివిధ వర్కింగ్ గ్రూపుల సమావేశాల, ఆర్ధిక గమన సారాంశాన్ని అందిస్తుంది.
ఇ పుస్తకంలో ఆఖరి భాగంలో గత ఏడాదిలో భారత్ జి20 అధ్యక్షతను ప్రజా ఆధారిత ఉద్యమంగా పరివర్తన చెందేలా దేశవ్యాప్తంగా నిర్వహించిన జన్-భాగీదారీ కార్యక్రమాలకు సంబంధించి ఫోటోలతోకూడిన వ్యాసాన్ని అందించారు.
ఈ పుస్తకం దిగువన ఇచ్చిన యుఆర్ఎల్‌లో అందుబాటులో ఉంటుంది. చదవదలచుకున్నవారు ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా దానిని పొందవచ్చు -
https://static.pib.gov.in/WriteReadData/userfiles/People_g20_flipbook/index.html
***
(Release ID: 1958682)
Visitor Counter : 159
Read this release in:
Kannada
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam