ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) ఏజెంట్లు,సిబ్బంది కోసం అమలు చేయనున్న సంక్షేమ కార్యక్రమాలకు ఆమోదం తెలిపిన ఆర్థిక మంత్రిత్వ శాఖ


గ్రాట్యుటీ పరిమితి పెంపు, పునరుద్ధరణ కమీషన్‌కు అర్హత, టర్మ్ ఇన్సూరెన్స్ సౌకర్యం, ఎల్‌ఐసి ఏజెంట్లు, ఉద్యోగులకు ఒకే విధమైన కుటుంబ పెన్షన్ రేటు లాంటి సంక్షేమ చర్యలు అమలు

Posted On: 18 SEP 2023 2:04PM by PIB Hyderabad

భారత  జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) ఏజెంట్లు,సిబ్బంది కోసం అమలు చేయనున్న వివిధ  సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు ఆమోదం తెలిపింది.  ఎల్‌ఐసి (ఏజెంట్) నిబంధనలు, 2017కు చేసిన సవరణలు, గ్రాట్యుటీ పరిమితి పెంపుదల, ఒకే విధమైన కుటుంబ పెన్షన్ రేటు లాంటి సంక్షేమ కార్యక్రమాలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. 

ఆర్ధిక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిన సంక్షేమ కార్యక్రమాల వివరాలు: 

* ఎల్‌ఐసీ ఏజెంట్ల గ్రాట్యుటీ పరిమితి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచడం.దీనివల్ల  ఏజెంట్ల పని తీరు మెరుగుపడుతుంది.ఏజెంట్లకు అందుతున్న ప్రయోజనాలు మరింత పెరుగుతాయి. 

*తిరిగి నియమించబడిన ఏజెంట్లు పునరుద్ధరణ కమీషన్‌కు అర్హత పొందుతారు. ఈ చర్య వల్ల   ఏజెంట్లకు   ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది.  ప్రస్తుతం, ఎల్‌ఐసి ఏజెంట్లు పాత ఏజెన్సీ కింద పూర్తి చేసిన ఏ వ్యాపారంపైనా పునరుద్ధరణ కమీషన్‌కు అర్హులు కారు. 

*ఏజెంట్లకు టర్మ్ ఇన్సూరెన్స్పరిమితి  ప్రస్తుతం ఉన్న రూ. 3,000-10,000 రూపాయల నుంచి  రూ. 25,000-1,50,000.లకు పెరుగుతుంది.  టర్మ్ ఇన్సూరెన్స్‌ మెరుగుదల వల్ల మరణించిన ఏజెంట్ల కుటుంబాలకు గణనీయంగా ప్రయోజనం కలుగుతుంది.  కుటుంబాలకు అందుతున్న సంక్షేమ ప్రయోజనాలు పెరుగుతాయి.

*ఎల్‌ఐసి  ఉద్యోగుల కుటుంబాల సంక్షేమం కోసం @30% ఏకరీతి రేటుతో కుటుంబ పెన్షన్.

ఎల్‌ఐసి అభివృద్ధిలో 13 లక్షలకు మించి ఏజెంట్లు , 1 లక్ష కంటే ఎక్కువ మంది సాధారణ ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నారు. భారతదేశంలో బీమా వ్యాప్తిని మరింత పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించిన  సంక్షేమ చర్యలు ఎజెంట్లు, సిబ్బందికి ప్రయోజనం కలిగిస్తాయి. 

 

***


(Release ID: 1958542) Visitor Counter : 4554