ప్రధాన మంత్రి కార్యాలయం
ఢిల్లీ ఎయిర్పోర్టు మెట్రో ఎక్స్ప్రెస్ లైన్ స్టేషన్ ,ద్వారకా సెక్టర్ 21 నుంచి యశోభూమి ద్వారకా సెక్టర్ 25 వరకు రైల్వే లైన్ పొడిగింపును ప్రారంభించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.
Posted On:
17 SEP 2023 4:20PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీ ఎయిర్ పోర్టు మెట్రో ఎక్స్ ప్రెస్ లైన్ను ద్వారకా సెక్టర్ 21 నుంచి , కొత్త గా నిర్మించిన యశోభూమి ద్వారకా సెక్టర్ 25 స్టేషన్ వరకు రైల్వేలైన్ ను అక్టోబర్ 17,2023 న ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం యశోభూమి ద్వారక సెక్టర్ 25 వద్ద జరిగింది. కొత్త మెట్రో స్టేషన్కు మూడు సబ్ వే లు ఉన్నాయి. 735 మీటర్ల పొడవుగల సబ్ వే స్టేషన్ నుంచి ఎగ్జిబిషన్ హాల్స్ కు, కన్వెన్షన్ సెంటర్ కు,
సెంట్రల్ ఎరీనాకు కలుపుతుండగా మరోకటి ద్వారకా ఎక్స్ప్రెస్ వే ఎంట్రీ , ఎగ్జిట్ పాయింట్లను కలుపుతుంది. మూడవది మెట్రో స్టేషన్ నుంచి యశోభహూమి భవిష్యత్ ఎగ్జిబిషన్ హాళ్లను కలిపే విధంగా ఉంటుంది.
ఎయిర్ పోర్టు ఎక్స్ ప్రెస్ లైన్ లో మెట్రో రైళ్ల వేగాన్ని ఢిల్లీ మెట్రో గంటకు 90 కిలోమీటర్ల వేగం నుంచి గంటకు 120 కిలోమీటర్ల వేగానికి పెంచుతుంది. దీని వల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుంది.
న్యూఢిల్లీ నుంచి యశోభూమి ద్వారక సెక్టర్ 25 కు చేరడానికి 21 నిమిషాల సమయం పడుతుంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యశోభూమి ద్వారకా సెక్టర్ 25 మెట్రోస్టేషన్ కు దౌలా కున్ మెట్రో స్టేషన్ నుంచి మెట్రోలో వచ్చారు.
ప్రధానమంత్రి కార్యాలయం ఎక్స్ లో ఒక పోస్ట్ చేస్తూ,
“ఢిల్లీ మెట్రో లో చిరునవ్వులు; ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యశోభూమి కన్వెన్షన్ సెంటర్ తొలి దశ ప్రారంభోత్సవానికి ద్వారక నుంచి మెట్రోలో ప్రయాణిస్తూ వివిధ రంగాలకు చెందిన ప్రజలను
రైలులో పలకరించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.”అని తెలిపింది.
ప్రధానమంత్రి ఎక్స్ లో ఒక పోస్టింగ్ పెడుతూ,
“ద్వారకకు అక్కడి నుంచి తిరుగు ప్రయాణం మెట్రోలో చిరస్మరణీయం. వివిధ రంగాల కు చెందిన ప్రయాణికులతో కలసి ప్రయాణించడం మరింత ప్రత్యేక అనుభవాన్నిచ్చింది.”అని పేర్కొన్నారు.
***
DS/TS
(Release ID: 1958477)
Visitor Counter : 156
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam