ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సింగపూర్‌ పూర్వ ప్రధాని లీ కున్ యూ శతజయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి నివాళి

प्रविष्टि तिथि: 16 SEP 2023 2:25PM by PIB Hyderabad

   సింగపూర్‌ పూర్వ ప్రధానమంత్రి శతజయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళి అర్పించారు.

   ఈ మేరకు ‘ఎక్స్‌’ ద్వారా పంపిన సందేశంలో:

“దేశానికి గొప్ప నాయకత్వం అందించిన సింగపూర్‌ పూర్వ ప్రధానమంత్రి లీ కున్‌ యూ శతజయంతి ప్రత్యేక సందర్భంలో ఆ ప్రజా నేతకు నా నివాళి. సింగపూర్ పరివర్తనాత్మక ప్రగతిలో ఆయన దార్శనిక నేతృత్వం కీలక పాత్ర పోషించింది. ఆయన దూరదృష్టి, సుపరిపాలన దిశగా అకుంఠిత దీక్ష ఆ గొప్ప నాయకుడి వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. ప్రపంచ దేశాధినేతలందరికీ ఆయన సదా స్ఫూర్తిదాయకుడిగా నిలిచిపోతారు” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1958056) आगंतुक पटल : 142
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam