ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రకాష్ పురబ్ సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
నాడు పోస్టు చేయడమైనది:
16 SEP 2023 1:27PM by PIB Hyderabad
శ్రీ గురు గ్రంథసాహిబ్ ప్రకాష్ పురబ్ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు 'ఎక్స్' పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:
“శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ కాలాలతో నిమిత్తం లేని జ్ఞానం, అపార కరుణ వంటి సద్గుణాలకు మార్గదర్శిగా నిలుస్తుంది. ఆ పవిత్ర గ్రంథంలోని ప్రబోధాలు దైవత్వంతో నిండినవై ఉంటాయి. ఇవి కాలాలకు, సరిహద్దులకు అతీతంగా లక్షలాది మందిని ప్రేమ, ఐక్యతలతో శాంతి మార్గంలో నడిపిస్తాయి.ఇది మానవత్వాన్ని అనుసరిస్తూ, నిస్వార్థ సేవను గౌరవించడంతోపాటు జీవితంలోని ప్రతి అంశంలోనూ సామరస్యాన్ని ఆకాంక్షించేలా మనకు స్ఫూర్తినిస్తుంది. ఇంతటి ప్రాశస్త్యం గల శ్రీ గురు గ్రంథ్ సాహిబ్ ప్రకాష్ పురబ్ నేపథ్యంలో మీకందరికీ నా శుభాకాంక్షలు" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
DS/TS
(రిలీజ్ ఐడి: 1957948)
సందర్శకుల సూచీ సంఖ్య : : 203
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Marathi
,
English
,
Urdu
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam