గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

స్వచ్ఛతా హీ సేవ-2023 ప్రారంభం


ప్రతి ప్రభుత్వ పథకంలోనే కాదు, పౌరుల జీవన విధానంలో కూడా స్వచ్ఛత ఒక మౌలిక సూత్రంగా మారింది: కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ ఎస్ పూరి

గత తొమ్మిదేళ్లలో 12 కోట్ల మరుగుదొడ్లు నిర్మించామని, బహిరంగ మలవిసర్జన మహమ్మారి నుంచి దేశాన్ని విముక్తం చేశామని శ్రీ హర్దీప్ ఎస్ పూరి ఉద్ఘాటన

Posted On: 15 SEP 2023 3:51PM by PIB Hyderabad

“'అంత్యోదయ నుండి సర్వోదయ' భావనకు  స్వచ్ఛభారత్ మిషన్ ఒక ప్రకాశవంతమైన ఉదాహరణ. ఇది మన నగరాలలోని అట్టడుగు , బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చింది. పట్టణ పేదల అభ్యున్నతి,  సాధికారతకు కృషి చేసింది.” అని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాలు ,పెట్రోలియం , సహజ వాయువు శాఖల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి అన్నారు. స్వచ్ఛతా హీ సేవ - 2023ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు.

స్వచ్ఛ భారత్ దివస్ ను పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ మిషన్-అర్బన్, గ్రామీణ్ సంయుక్తంగా సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 23 వరకు వార్షిక స్వచ్ఛతా హీ సేవా (ఎస్ హెచ్ ఎస్) పక్షోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0, సఫాయిమిత్ర సురక్షా శిబిరం, సామూహిక పరిశుభ్రతా కార్యక్రమాలు వంటి వివిధ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది పౌరుల భాగస్వామ్యాన్ని సమీకరించాలని ఈ పక్షోత్సవం  లక్ష్యంగా పెట్టుకుంది.

ఎస్ హెచ్ ఎస్-2023ను జల్ శక్తి మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి, గ్రామీణాభివృద్ధి ,పంచాయితీ రాజ్ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్  - గృహనిర్మాణ , పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిశోర్, తాగునీరు,  పారిశుద్ధ్య శాఖ కార్యదర్శి శ్రీమతి వినీ మహాజన్,  గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ మనోజ్ జోషి సమక్షంలో వర్చువల్ గా  ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో లేహ్, లడఖ్ , పింప్రి, మహారాష్ట్ర; మీరట్, ఉత్తర ప్రదేశ్; లఖింపూర్, అస్సాం నగరాలకు చెందిన సీనియర్ అధికారులు.తమ తమ నగరాల్లో స్వచ్ఛత సంబంధిత కార్యకలాపాల ఉత్తమ పద్ధతులను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్ హెచ్ ఎస్ -2023పై ఒక వీడియోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ హెచ్ ఎస్ -2023 లోగో, వెబ్ సైట్, , పోర్టల్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 'ఇండియన్ స్వచ్ఛతా లీగ్ (ఐఎస్ఎల్) 2.0', 'సఫాయిమిత్ర సురక్షా శివర్' లోగోలు, 'సిటిజన్స్ పోర్టల్'ను ప్రారంభించారు.

ఎస్ బిఎమ్ , ఎస్ హెచ్ ఎస్ 2023 ప్రారంభం గురించి శ్రీ హర్ దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, స్వచ్ఛ భారత్ మిషన్ రాబోయే తొమ్మిదవ వార్షికోత్సవం , 'స్వచ్ఛతే సేవ' 2023 ప్రారంభం ఒక వేడుక క్షణం అని అన్నారు. మన నగరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యాన్ని పునరుద్ఘాటించాల్సిన సమయం ఇది. స్వచ్ఛతే సేవా పక్షోత్సవాలను ప్రారంభించడం ద్వారా స్వచ్ఛత కోసం మనల్ని మనం తిరిగి అంకితం చేసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

2014 ఆగస్టు 15న గౌరవ ప్రధాని ఎర్రకోటపై నుంచి స్వచ్ఛభారత్ మిషన్ ను ప్రకటించినప్పుడు ఇంత పెద్ద ఎత్తున మార్పును ఊహించలేదని గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి అన్నారు. అప్పటి వరకు పారిశుధ్యంలో పేలవమైన పనితీరు కనబరిచినప్పటికీ, తరువాతి ఐదేళ్లలో భారత్ ఒ డి ఎఫ్ లక్ష్యాన్ని సాధించింది. భారతదేశంలోని మొత్తం 4,884 యుఎల్ బి లు (100%) ఇప్పుడు బహిరంగ మలవిసర్జన రహితం ( ఒడిఎఫ్) గా ఉన్నాయి.

ఎస్ బిఎమ్ తీసుకువచ్చిన పరివర్తన గురించి శ్రీ పురి మాట్లాడుతూ, 73.62 లక్షల మరుగుదొడ్లు (67. 1 లక్ష వ్యక్తిగత గృహ మరుగుదొడ్లు ,6.52 లక్షల కమ్యూనిటీ ,పబ్లిక్ టాయిలెట్లు) నిర్మించడం ద్వారా, మనం మిలియన్ల మంది పట్టణ పేదలకు గౌరవం, ఆరోగ్యాన్ని అందించాము. భారతదేశంలోని 95% వార్డుల్లో 100% ఇంటింటికీ చెత్త సేకరణ ఉంది. 88 శాతానికి పైగా వార్డుల్లో వ్యర్థాలను వేరు చేశారు. స్వచ్ఛభారత్ మిషన్ సాధారణ సర్కారీ కార్యక్రమంగా కాకుండా 'జన్ ఆందోళన్'గా రూపాంతరం చెందడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.

ప్రతి ప్రభుత్వ పథకంలోనే కాకుండా పౌరుల జీవన విధానంలో కూడా స్వచ్ఛత ఒక మౌలిక సూత్రంగా మారిందని శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఉద్ఘాటించారు.

ఇప్పటివరకు ఎస్ బి ఎం  సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, గత తొమ్మిదేళ్లలో 12 కోట్ల మరుగుదొడ్లను నిర్మించామని, బహిరంగ మలవిసర్జన మహమ్మారి నుంచి దేశాన్ని విముక్తం చేశామని గృహనిర్మాణ, పట్టణ మంత్రి తెలిపారు. మిషన్ ప్రారంభంలో దాదాపుగా ఉనికిలో లేని ఘన వ్యర్థాల నిర్వహణ ఇప్పుడు 76 శాతంగా ఉందని, త్వరలోనే 100 శాతం సాధిస్తామని చెప్పారు.

స్వచ్ఛ భారత్ మిషన్ - అర్బన్ 2.0 (ఎస్ బి ఎం- యు 2.0) ద్వారా ఈ మిషన్ పట్టణ భాగాన్ని 2026 వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. మన నగరాలన్నింటినీ 'గార్బేజ్ ఫ్రీ'గా మార్చడం ,వారసత్వ డంప్ సైట్లను పరిష్కరించడం దీని లక్ష్యం. 

మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ (ఎంఆర్ఎఫ్), వేస్ట్-టు-ఎనర్జీ ప్లాంట్లు (డబ్ల్యుటిఇ ప్లాంట్లు), నిర్మాణాలు- కూల్చివేత వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల ఉత్పన్న ఇంధనం (ఆర్డిఎఫ్) ప్లాంట్లు, శాస్త్రీయ ల్యాండ్ ఫిల్ సైట్లు , వారసత్వ వ్యర్థాల నివారణతో సహా ఎస్ బి ఎం-యు 2.0 దృష్టి ప్రాంతాలు అనేక అంశాలను కలిగి ఉంటాయి.

తన ముగింపు ప్రసంగంలో, ప్రతి నగరం, గ్రామం, వార్డు ,పరిసర ప్రాంతాలు స్వచ్ఛత కోసం తమ శ్రమ (స్వచ్ఛంద శ్రమ) ను విరాళంగా ఇవ్వడానికి ప్రతిజ్ఞ చేస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మన నగరాలు చెత్తాచెదారం లేనివిగా ఉండేలా, సంపూర్ణ స్వచ్ఛత సాకారం అయ్యేలా ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు.

స్వచ్ఛతా హీ సేవ' గురించి:

అక్టోబర్ 2 న మహాత్మాగాంధీ జయంతి సందర్భంలో స్వచ్ఛభారత్ దివస్ ను పురస్కరించుకుని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, జల్ శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన తాగునీరు, పారిశుద్ధ్య శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ 9 సంవత్సరాలను జరుపుకోవడానికి.2023 సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 2 వరకు 'స్వచ్ఛతా హీ సేవా' పక్షోత్సవాలను నిర్వహిస్తున్నాయి.  

స్వచ్ఛత కోసం జన్ ఆందోళన్ మిషన్ కు వెన్నెముక. ఎస్ హెచ్ ఎస్ - 2023 థీమ్ "గార్బేజ్ ఫ్రీ ఇండియా". పక్షోత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాలు స్వచ్ఛతా దివస్ 2023ను పురస్కరించుకుని భారతదేశాన్ని పరిశుభ్రంగా, చెత్త రహితంగా తీర్చిదిద్దాలన్న అందరి నిబద్ధతను పునరుద్ఘాటిస్తాయి.

స్వచ్చంద, శ్రమదానం స్ఫూర్తితో స్థానిక సంస్థలలో పరిశుభ్రతను సాధించడం, అలాగే సఫాయిమిత్రల సంక్షేమంపై ఎస్ హెచ్ ఎస్-2023 దృష్టి సారిస్తుంది. రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని కార్యాలయాలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్ లు,  బీచ్ లు, పర్యాటక ప్రదేశాలు, జంతుప్రదర్శనశాలలు, జాతీయ ఉద్యానవనాలు, అభయారణ్యాలు, చారిత్రక కట్టడాలు, వారసత్వ ప్రదేశాలు, నదీ తీరాలు, ఘాట్లు, మురుగు కాలువలు, నాలాలు వంటి కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాల్లో అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు స్వచ్ఛతా కార్యక్రమాలను నిర్వహిస్తాయి.

ఈ కార్యక్రమాలలో అన్ని ముఖ్యమైన ప్రదేశాల నుండి చెత్తను తొలగించడం, వారసత్వ వ్యర్థాలను తొలగించడం, మరమ్మతులు, పెయింటింగ్, క్లీనింగ్ , చెత్త బుట్టలు, పబ్లిక్ టాయిలెట్లు, చెత్త పాయింట్లు, వ్యర్థ రవాణా వాహనాలు , మెటీరియల్ రికవరీ ఫెసిలిటీస్ వంటి అన్ని పారిశుద్ధ్య ఆస్తుల బ్రాండింగ్, మార్కెట్లు, బహిరంగ ప్రదేశాలు,  పర్యాటక ప్రదేశాలను ఎస్ బి ఎం వాల్ పెయింటింగ్స్ , డస్ట్ బిన్ లతో నింపడం, స్వచ్ఛత క్విజ్ లు, ప్లాంటేషన్ డ్రైవ్ లను నిర్వహించడం,  స్వచ్ఛతా ప్రతిజ్ఞలు , స్వచ్ఛతా రన్ మొదలైనవి ఉన్నాయి. 

ఎస్ హెచ్ ఎస్ -2023 కింద నిర్వహించాల్సిన కీలక కార్యకలాపాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

1.స్వచ్ఛతా హీ సేవ - పక్షం రోజుల పాటు పరిశుభ్రత కార్యక్రమాలు

'ట్విన్ బిన్', సోర్స్ సెగ్రిగేషన్ కోసం వినూత్నమైన, ప్రత్యేకమైన అవగాహన పద్ధతులతో చెత్తకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడుతుండటంతో ఈ పక్షం రోజుల్లో స్వచ్ఛత గాలిలో ప్రతిధ్వనిస్తుంది. ఎస్ హెచ్ ఎస్ - 2023 లో భాగంగా, అన్ని భారత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, పిఎస్ యులు, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు వివిధ ప్రదేశాలలో భారీ పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఇంటర్ సెక్టోరల్ కార్యకలాపాలలో భాగంగా పర్యాటక మంత్రిత్వ శాఖ పరిధిలో అధిక సందర్శకులు వచ్చే పర్యాటక ప్రదేశాలు/ పుణ్యక్షేత్రాలను శుభ్రం చేస్తారు. రైల్వే ఆధ్వర్యంలో రైల్వే ప్లాట్ఫారమ్ లు, పరిసర ప్రాంతాలలో 'హర్ పత్రి సాఫ్ సుతారి' పరిశుభ్రత కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఉన్నత విద్య, పాఠశాల విద్య శాఖ స్వచ్చత కార్యకలాపాల కోసం విశ్వవిద్యాలయాలు , పాఠశాల విద్యార్థులను భాగస్వామ్యం చేస్తాయి, ఇక ఎం ఒ పి ఎన్ జి పెట్రోల్ బంకులు మొదలైన వాటిలో పరిశుభ్రత,  అవగాహన డ్రైవ్ లను నిర్వహిస్తుంది.

2.ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0

తొలిసారిగా నిర్వహిస్తున్న 'ఇండియా స్వచ్ఛతా లీగ్' రెండో ఎడిషన్ దేశం లో ఒక ప్రభంజనం కాబోతోంది. యువత సారథ్యంలో జరుగుతున్న ఐఎస్ఎల్ సీజన్-  2 మరింత ఉత్కంఠభరితంగా, ఉత్సాహంగా  స్వచ్చత లీగ్ ను నెరవేరుస్తుంది. సెప్టెంబర్ 17న యూత్ నేతృత్వంలోని సిటిజన్ టీమ్స్ ద్వారా చెత్తపై పోరులో విజయం సాధించేందుకు 4 వేలకు పైగా నగర జట్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ ఏడాది బీచ్ లు, కొండలు, పర్యాటక ప్రాంతాలను శుభ్రం చేసేందుకు నగర బృందాలు ర్యాలీ నిర్వహించనున్నాయి. ఐఎస్ఎల్ 2.0 ఈ పక్షం రోజుల్లో స్వచ్ఛత కోసం స్థిరమైన యాజమాన్యం తీసుకోవడానికి యువజన బృందాలను పెద్ద ఎత్తున సమీకరించనుంది. స్వచ్ఛభారత్ మిషన్ కింద యువత కార్యాచరణకు ఈ స్వచ్ఛతా లీగ్ ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది.

3.సఫాయిమిత్ర సురక్షా శిబిరం 

స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్ కు తొమ్మిదేళ్లు, ఎస్ బి ఎం- యు  2.0 కు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మహాత్మాగాంధీకి నివాళిగా 2023 సెప్టెంబర్ 17 నుంచి దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో సఫాయిమిత్ర సురక్షా శివిర్ పేరుతో సింగిల్ విండో సంక్షేమ శిబిరాలను నిర్వహించనున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, వారిపై ఆధారపడిన వారికి సంక్షేమ పథకాలు అందించడం, వారి శ్రేయస్సు, జీవన ప్రమాణాలను మెరుగుపర్చడం ఈ శిబిరాల లక్ష్యం. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ (ఎస్ డబ్ల్యూఎం), యూజ్డ్ వాటర్ మేనేజ్ మెంట్ (యు డబ్ల్యూఎం)లోని పారిశుద్ధ్య కార్మికులందరినీ లక్ష్యంగా చేసుకోవడమే ఈ శిబిరం లక్ష్యం. ప్రజల్లో అవగాహన కల్పించడం, ఆరోగ్య పరీక్షలు, యోగా శిబిరాలు, వివిధ మంత్రిత్వ శాఖల సమన్వయంతో కేంద్ర, రాష్ట్ర పథకాల సంక్షేమ ఫలాలను అందించడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. సంక్షేమ పథకాల నిర్వహణలో ఈ సంతృప్త విధానం పారిశుద్ధ్య కార్మికుల భద్రత, శ్రేయస్సును పెంచడానికి , వారికి సామాజిక రక్షణను అందించడానికి సహాయపడుతుంది.

 

***



(Release ID: 1957839) Visitor Counter : 410