గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
జి 20 శిఖరాగ్ర సమ్మేళనంలో అందరి దృష్టిని ఆకర్షించిన ట్రైఫెడ్ హస్తకళాకారులు
Posted On:
11 SEP 2023 4:14PM by PIB Hyderabad
న్యూఢల్లీిలో జరిగిన జి 20 శిఖరాగ్ర సమ్మేళనం సందర్భంగా భారతీయ సుసంపన్న గిరిజన వారసత్వం, హస్తకళానైపుణ్యాలను, గిరిజన వ్యవమారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో, ట్రైఫెడ్` భారత గిరిజన సహకార మార్కెటింగ్ అభివృద్ధి ఫెడరేషన్ ప్రదర్శించింది.గిరిజన హస్తకళాకారులు రూపొందిఆంచిన ఎన్నో అద్భుత ఉత్పత్తులను ఈ సందర్భంగా ప్రదర్శనకుపెట్టారు. ఇవి దేశంలోని వివిధ ప్రాంతాలలో తయారైనవి. వీటిని తిలకించి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రతినిధులు అబ్బురపడ్డారు. గిరిజనులు ఉత్పత్తి చేసిన వాటిని చూసి వారు వారి ప్రతిభని కొనియాడారు. శ్రీ పరేష్ భాయ్ జయంతి భాయ్ రాథ్వా, జి20 క్రాఫ్ట్స్ బజార్ లో ప్లితోరా ఆర్ట్‌కు సంబంధించి ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చారు.
ఫోటో: శ్రీ పరేష్ భాయ్ జయంతి భృాయ్ రాథ్వా ప్లితోరా కళకు సంబంధించి ప్రత్యక్షంగా ప్రదర్శన ఇస్తున్న దృశ్యం.
ఈ సందర్భంగా పలు ఉత్పత్తులతో పాటు, పలు వస్తువులు ఈ సమావేశాలకు హాజరైన వారిని విశేషంగా ఆకర్షించాయి.అవి:
1. లోంగ్‌పి పాటరీ: మణిపూర్ లోని లోంగ్‌పి గ్రామం పేరుమీద తంగ్‌ఖులÊ నాగా గిరిజన తెగ వారు ఒక విశేషమైన రీతిలో మట్టిపాత్రలు తయారు చేస్తారు. మామూలుగా మట్టి పాత్రలను కుమ్మరి చక్రాన్ని ఉపయోగించకుండా చేతితో వీటిన తయారు చేయడం వీరి ప్రత్యేకత. అన్నిరకాల మట్టిపాత్రల, కళాకృతుల రూపాలను వీరు చేతితోనే మలుస్తారు. ఇవి మట్టిరంగులో, నలుపు రంగులో ఉంటాయి. మట్టి వంటపాత్రలు,కెటిల్ లు,చిన్న పాత్రలు, మగ్‌లు , ట్రేలు తయారు చేస్తారు. గతంలో గోక్‌పి ట్రేడ్ మార్క్‌గా వెదురు హ్యాండిల్ ఉండేది. అయితే ఇప్పుడు రకరకాల డిజైన్ లు వచ్చాయి. వీరు తమ ఉత్పత్తుల సంఖ్యను పెంచడమే కాక, మట్టిపాత్రలు వస్తువులను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
ఫోటో: లోంగ్‌పి మట్టి పాత్రల తయారీ అద్భుత కళ. ఇది గొప్ప వారసత్వానికి ప్రతీక,
2. 2. ఛత్తీస్ ఘడ్ వేణువులు:
ఛత్సీస్‌ఘడ్‌లోని బస్తర్‌కు చెందిన గోండ్ గిరిజనులు వీటిని తయారుచేశారు. సులుర్ వెదురు పిల్లనగ్రోవులు అద్భుతమైన సంగీతాన్ని వీనుల విందుచేస్తాయి. సంప్రదాయవేణువుల లా కాకుండా ఇది ఒంటి చేతితో వాయించడం ద్వారా సులభంగా అద్భుతమైన స్వరాలను పలికించగలదు. ఇందుకు వారు ఒక ప్రత్యేకమైన వెదురు ను ఎంపిక చేసుకుంటారు. దానికి రంధ్రాలు వేసి, దానిపై చేప బొబ్మలతో అందంగా రూపొందిస్తారు. దీనిపై గీతలు, త్రిభుజాల గుర్తులు వేస్తారు. సంగీతమే కాకుండా ఈ సులర్‌కు పిల్లనగ్రోవి ఉపయోగాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవి గిరిజనులు అడవిలో వెళ్ళేటపుడు వీటిని ఊదుతూ శబ్దం చేయడం ద్వారా జంతువులు దూరంగా వెళతాయి. అలాగే పశువులకు అడవిలో మార్గనిర్దేశం చేస్తాయి. అద్భుతమైన కళాకృతితో పాటు దీని ఉపయోగం కూడా అద్భుతమైనదే. ఇది గోండుల దేశీయ కళాత్మక నైపుణ్యానికి నిలువుటద్దంగా నిలుస్తుంది.
ఫోటో: ఛత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ లో గోండుగిరిజనులు అద్భుతంగా రూపొందించిన వేణువులు
గోండ్ పెయింటింగ్స్:
గోం డుల పెయింటింగ్ ఎంతో కళాత్మకమైనది. వారి సృజనాత్మక పెయింటింగ్స్ వారికి ప్రకృతి, సంప్రదాయాలతో గల అనుబంధాన్ని తెలియజేస్తుంది. ఈ పెయింటింగ్స్, ప్రపంచవ్యాప్తంగా గల కళౄభిమానుల హృదయాలను హత్తుకునే విధంగా ఉంటాయి. గోండు కళాకారులు సమకాలీన మాధ్యమాల ద్వారా ,కొత్త ఒరవడితో తమ కళాత్మక పెయింటింగ్లను రూపొందిస్తారు. ఇందులో అద్భుతమైన రంగులు వాటి ప్రత్యేకత. ఇవి వారి సామాజిక అనుబంధాన్ని, రోజువారి జీవితంలోని అంశాలను పెనవేసుకునే విధంగా ఉంటాయి. గోండుల పెయింటింగ్స్ పరిసరాలతో అనుబంధం కలిగి ఉంటాయి.
ఫోటో: గోండు కళ, ప్రతి కుంచెలో కళాత్మకత
గోడకు వేలాడదీసే గుజరాతి కళాత్మక తోరణాలు. గుజరాత్ లోని దహోద్ కు చెందిన భిల్ పటేలియా తెగ వారు వీటిని రూపొందిస్తారు. ఇది ప్రాచీన గుజరాతీ కళ. దీనిఇని వారు కాపాడుకుంటూ వస్తున్నారు. గోడలకు వేలాడదీసే ఈ అపురూప కళాకృతులు ప్రతిఒక్కరికీ నచ్చుతాయి. పశ్చిమ గుజరాత్లోని భిల్ తెగ వారు వీటిని అందంగా రూపొందిస్తారు. ఇందులో తొలుత బొమ్మలు, ఊయలకు అమర్చే పక్షుల బొమ్మలు వంటివి ఉండేవి. ఫీచర్ కాటన్ వస్త్రం, రీసైకిల్ చేసిన సామగ్రిని వాడి వీటిని రూపొందిస్తారు. ఇప్పుడు వీరు వీటికి మిర్రర్ వర్క్ , జరి, వివిధ రాళ్లు, బీడ్లు,చేర్చి సమకాలీన అభిరుచులకు అనుగుణంగా వీటిని రూపొందిస్తున్నారు.
ఫోటో: గుజరాత్ కు చెందిన దహోద్ పటేలియా తెగ, భిల్ తెగ వారు రూపొందించిన వాల్ హ్యాంగింగ్లు,
హిమాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్కు చెందిన గొర్రెల ఉన్నితో రూపొందించిన వస్త్రాలను అద్భుతమైన రీతిలో గిరిజనులు తయారు చేస్తున్నారు.
గతంలో తెలుపు ,నలుపు, బూడిద రంగులో వీటిని తయారు చేసేవారు. ఆ తర్వాత వీటిని రెండు మూడు రంగులమేళవింపుతో తయారు చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్ కుచెందిన బోధ్, భుటియా, గుజ్జర్ , బకర్వాల్ గిరిజన తెగలు వీటిని కళాత్మకంగా రూపొందిస్తున్నాయి. స్వచ్ఛమైన ఉన్నితో వీటిని తయారు చేస్తున్నారు.జాకెట్లు, షాల్స్, ఇతర రకాల దుస్తులను అందంగా వీటితో తయారు చేస్తున్నారు. ఎంతో శ్రమించి వాటిని తయారు చేస్తున్నారు.
ఫోటో: ఊలుతో తయారు చేసిన షాల్స్, దుప్పట్లు
అరకు లోయ కాఫీ: ఆంధ్రప్రదేశ్లోని ప్రకృతి అందాలకు నిలయమైన అరకు లోయ నుంచి ఘుమఘుమ లాడే సువాసనతో , సుస్థిర వ్యవసాయ పద్ధతుల ద్వారా
అరకు కాఫీని పండిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక పద్ధతులను ఉపయోగిస్తున్నారు.
అరకు లోయ ఆరబికా కాఫీకి , స్వచ్ఛతకు ఎంతో పేరు
ఫోటో: అరకు కాఫీ, ఇతర సహజ సిద్ద ఉత్పత్తుల ప్రదర్శన
రాజస్థాన్ కళాకృతులు, మోజాయిక్ దీపాలు, అంబారీ మెటల్ వర్క్లు, మీనకారీ క్రాఫ్ట్లు :
రాజస్థాన్ కు చెందిన కళాకారులు వీటిని రూపొందిస్తారు. వీరు గొప్ప గిరిజన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని వీటిని రూపొందిస్తున్నారు.
గ్లాస్ మొజాయిక్ పాత్రలు
మొజాయి కళాకృతి పద్ధతిలో దీపాల షేడ్లు, క్యాండిల్ హోల్డర్లు తయారు చేస్తారు. వీటిని వెలిగించినపుడు, ఇవి కలడోస్కోప్ రంగులను ప్రతిబింబిస్తాయి. దీనితో ఆ ప్రాంతం రంగురంగులతో వెలుగులు నిండుతాయి.
మీనకారీ అనేది మరో రకమైన కళ. ఇది లోహపు వస్తువులపై మినరల్ తో కూడిన వాటిని అద్దుతారు. ఇది మొఘలుల కాలంలో ఉండేది. ఈ రాజస్థానీ సంప్రదాయం అనుసరించడానికి అద్భుతమైన నైపుణ్యం అవసరం. సున్నితమైన డిజైన్లు లోహాలపై చిత్రించి వాటిని రంగులతో నింపుతారు. ఎనామిల్ కోటింగ్ కూడా ఉంటుంది.
లోహపు అంబారి :
మీనా గిరిజన తెగ లోహపు అంబారీలను అద్భుతంగా తయారు చేస్తుంది. ఇందులో అలంకరణ కూడా ఎంతో ప్రత్యేకం. వీటిని బంగారు, వెండి, రాగి వంటి వాటితో కూడా తయారు చేస్తున్నారు. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుత నైపుణ్యం కలిగినది. ఇది రాజస్థాన్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
ఫోటో: రాజస్థాన్ కు చెందిన కళాత్మక ఉత్పత్తులు
ఎంతో నైపుణ్యంతో వివిధ కళాకారులు రూపొందించిన ఈ ఉత్పత్తులు కేవలం అలంకరణకు మాత్రమే పరిమితమైనవి కావు. ఇవి భారతదేశపు గొప్ప సాంస్కృతిక వైవిధ్యాన్ని, వారసత్వాన్ని ప్రతిబింబిస్తాయి.
(Release ID: 1956518)
Visitor Counter : 178