ప్రధాన మంత్రి కార్యాలయం
ఇటలీ ప్రధాని మెలోనీతో ప్రధానమంత్రి మోదీ సమావేశం
Posted On:
09 SEP 2023 7:57PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గౌరవనీయులైన ఇటలీ గణతంత్ర ప్రధానమంత్రి జియోర్జియా మెలోనీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. ఇటలీ ప్రధాన భారత సందర్శనకు రావడం ఇది రెండోసారి కాగా, ఇంతకుముందు 2023 మార్చిలో ఆమె తొలిసారి పర్యటించారు. ప్రధానులిద్దరి మధ్య తాజా సమావేశం సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యంగా మలచుకోవడంపై చర్చ సాగింది.
భారత జి-20 అధ్యక్ష బాధ్యతల నిర్వహణలో ఇటలీ మద్దతుతోపాటు ప్రపంచ జీవ ఇంధన కూటమి సహా భారత-మధ్య ప్రాచ్యం-ఐరోపా ఆర్థిక కారిడార్‌లోనూ ఆ దేశం సభ్యత్వం స్వీకరించడంపై ప్రధాని మోదీ ప్రశంసించారు.
రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తికావడంపై నాయకులిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. భారత-ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి సంబంధించిన భిన్న అంశాలపై వారిద్దరూ సమీక్షించారు. రక్షణ రంగంతోపాటు నవ్య-వర్ధమాన సాంకేతిక పరిజ్ఞానాలపై సహకార విస్తరణపై అంగీకారానికి వచ్చారు. విస్తృత ప్రపంచ శ్రేయస్సు దృష్ట్యా జి-7, జి-20 కూటములు సమష్టిగా కృషి చేయాల్సిన అవసరాన్ని వారు నొక్కిచెప్పారు. కాగా, జి-20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడంపై ప్రధాని మెలోనీ ప్రధానమంత్రికి అభినందనలు తెలిపారు.
*****
(Release ID: 1955915)
Visitor Counter : 154
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam