ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                        మొరాకో భూకంపంలో ప్రాణనష్టంపై ప్రధానమంత్రి సంతాపం
                    
                    
                        
ఈ క్లిష్ట పరిస్థితుల్లో అన్నివిధలా చేయూతనిస్తామని ఆ దేశానికి భరోసా
                    
                
                
                    Posted On:
                09 SEP 2023 8:39AM by PIB Hyderabad
                
                
                
                
                
                
                   మొరాకో భూకంపం ఫలితంగా పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం సంభవించడంపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి కష్ట సమయంలో నేపథ్యంలో వీలైనంత మేర చేయూతనిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆ దేశానికి భరోసా ఇచ్చారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పోస్టు చేసిన ఒక సందేశంలో: 
“మొరాకోలో భూకంపం సంభవించి పెద్ద ఎత్తున ప్రాణనష్టం కలగడం అత్యంత బాధాకరం. ఈ విషాద సమయంలో ఆ దేశ ప్రజల క్షేమం కోసం దైవాన్ని ప్రార్థిస్తున్నాను. ఈ వైపరీత్యంలో ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలుపుతున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కడంలో అన్ని విధాలా చేయూతనిచ్చేందుకు భారత్ సిద్ధంగా ఉందని మొరాకో ప్రజలకు హామీ ఇస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
 
********
DS/ST
                
                
                
                
                
                (Release ID: 1955786)
                Visitor Counter : 196
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam