ప్రధాన మంత్రి కార్యాలయం

నల్లా నీటికనెక్శన్ ల సంఖ్య 3 కోట్ల నుండి గత నాలుగేళ్ల లో 13 కోట్ల కు చేరుకోవడాన్నిప్రశంసించిన ప్రధాన మంత్రి 

Posted On: 05 SEP 2023 7:59PM by PIB Hyderabad

నీటి ని నల్లా ల ద్వారా సరఫరా చేస్తున్న కనెక్శన్ ల సంఖ్య 3 కోట్ల నుండి కేవలం మూడు సంవత్సరాల కాలం లో 13 కోట్ల కు చేరుకొన్న సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు. శుద్ధమైన నీటి ని ప్రజల కు అందుబాటు లోకి తీసుకు రావడం లో జల్ జీవన్ మిశన్ ఒక మైలురాయి గా రుజువు అవుతోందని, అంతే కాక జీవన సౌలభ్యాన్ని మరియు ప్రజల ఆరోగ్యాన్ని కూడా పెంచుతోందని ప్రధాన మంత్రి అన్నారు.

 

 

కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్ నమోదు చేసిన ఒక పోస్టు కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -

‘‘ఈ అద్భుతమైనటువంటి కార్యసాధన కు గాను చాలా చాలా అభినందన లు. శుద్ధమైన త్రాగునీరు భారతదేశం లోని పల్లెల లో నివసిస్తున్న నా కుటుంబ జనుల కు చేరుకోవాలి, ‘జల్ జీవన్ మిశన్’ ఈ దిశ లో మైలురాయి కాబోతోంది. ఇది వారి యొక్క ఇక్కట్టుల ను దూరం చేయడం లో తోడ్పాటు ను అందించడం ఒక్కటే కాకుండా వారి కి చక్కని ఆరోగ్యాని కి కూడాను పూచీపడుతున్నది.’’ అని ఎక్స్ మాధ్యం లో ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

 

 



(Release ID: 1955447) Visitor Counter : 108