ప్రధాన మంత్రి కార్యాలయం
హాకీ-5 ఆసియా కప్ కైవసంపై భారత పురుషుల జట్టుకు ప్రధాని అభినందనలు
Posted On:
03 SEP 2023 10:11AM by PIB Hyderabad
ఆసియా కప్ హాకీ-5 పోటీల్లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్టు ద్వారా పంపిన సందేశంలో:
“మనం హాకీ-5 ఆసియాకప్ చాంపియన్లం! ఈ పోటీల్లో అసమాన ప్రతిభతో అద్భుత విజయం సాధించిన మన క్రీడాకారులకు అభినందనలు. మన ఆటగాళ్ల అకుంఠిత దీక్షకు, అంకిత భావానికి ఈ విజయం నిదర్శనం. ఈ విజయం ద్వారా వచ్చే ఏడాది ఓమన్‌లో నిర్వహించే హాకీ-5 ప్రపంచకప్‌లో పాల్గొనే జట్ల జాబితాలో మన స్థానం కూడా ఖరారైంది. మన క్రీడాకారుల దృఢ సంకల్పం, పట్టుదల సదా మన దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1954526)
Visitor Counter : 206
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam