ప్రధాన మంత్రి కార్యాలయం
జాతీయ పోషకాహార మాసం మన కుటుంబాలకు కీలక కార్యక్రమం: ప్రధానమంత్రి
Posted On:
01 SEP 2023 8:26PM by PIB Hyderabad
జాతీయ పోషకాహార మాసం మన కుటుంబాలకు బృహత్తర కార్యక్రమమని, ఇది ప్రజా భాగస్వామ్యంతో విజయవంతం కాగలదని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ కార్యక్రమం గురించి తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రస్తావించిన వీడియోను ఆయన ప్రజలతో పంచుకున్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:
“జాతీయ పోషకాహార మాసం’ మన కుటుంబ సభ్యుల మెరుగైన ఆరోగ్యం కోసం తలపెట్టిన ఓ బృహత్తర కార్యక్రమం, ప్రజల భాగస్వామ్యం ద్వారా మాత్రమే ఇది విజయవంతం కాగలదు. పోషకాహార లోపరహిత భారతదేశం కోసం దేశవ్యాప్తంగా ఎన్ని విధాలుగా ప్రత్యేక కృషి కొనసాగుతున్నదనే అంశాన్ని నేను నా ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలోనూ వివరించాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1954483)
Read this release in:
Kannada
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam