ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బాలల తో  రక్షా బంధన్ ను వేడుక గా జరుపుకొన్న ప్రధాన మంత్రి


వివిధ అంశాల పై బాలల తో మాట్లాడిన ప్రధాన మంత్రి

చంద్రయాన్-3యొక్క ఇటీవలి సాఫల్యం గురించి బాలలు వారి సకారాత్మకమైన ఆలోచనల ను తెలియజేయడం తోపాటు గా రాబోయే కాలం లో మొదలయ్యే ఆదిత్య ఎల్-1 మిశన్ పట్ల కూడా వారి ఉత్సాహాన్నివ్యక్తం చేశారు 

Posted On: 30 AUG 2023 3:06PM by PIB Hyderabad

బాలల తో కలసి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రక్షా బంధన్ ను ఈ రోజు న 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఓ వేడుక గా జరుపుకొన్నారు.

బాల లు ప్రధాన మంత్రి కి రాఖీ ని కట్టారు; ఆయన అనేక అంశాల ను గురించి వారితో ముచ్చటించారు. ఇటీవల చంద్రయాన్-3 మిశన్ సఫలం కావడం గురించి బాల లు వారి వారి ఆలోచనల ను తెలియజేశారు; అలాగే త్వరలో జరుగనున్న ఆదిత్య ఎల్-1 మిశన్ పట్ల వారు వారి ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భం లో బాల లు కొన్ని కవితల ను కూడా వినిపించారు, కొన్ని పాటల ను కూడా వారు పాడారు. వారి భావ ప్రకటన తీరు ప్రధాన మంత్రి కి నచ్చడం తో, ప్రజల కు మేలు జరిగేందుకు ప్రభుత్వ పథకాలు సహా అనేక అంశాల పైన కవితల ను వ్రాయండి అంటూ వారి ని ప్రోత్సహించారు. ఆత్మనిర్భరత యొక్క ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, భారతదేశం లో తయారు అయిన ఉత్పత్తుల ను వాడండి అంటూ బాలల కు సలహా ను కూడా ఇచ్చారు.

పలువురు విద్యార్థులు వారి యొక్క గురువుల తో సహా ఈ సంబురం లో పాలుపంచుకొన్నారు. ప్రభుత్వేతర సంస్థ ల ప్రతినిధులు, వృందావన్ లోని వితంతు మహిళ లు మరియు ఇతరులు కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు.

 

***

 

 


(Release ID: 1953542) Visitor Counter : 168