ప్రధాన మంత్రి కార్యాలయం

యుఎఇ అధ్యక్షునితో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


భారతదేశం యొక్క చంద్రయాన్-3 మిశన్ విజయవంతం అయినందుకు హృద‌ యపూర్వక శుభాకాంక్షల ను తెలిపిన యుఎఇ అధ్యక్షుడు

ఆయన కు ధన్యవాదాలను తెలిపిన ప్రధానమంత్రి ; జి20 శిఖర సమ్మేళనం లో ఆయన కు స్వాగతం పలకడం కోసం ఎదురుచూస్తున్నట్లుతెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 24 AUG 2023 9:58PM by PIB Hyderabad

యుఎఇ అధ్యక్షుడు శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.


యుఎఇ అధ్యక్షుడు భారతదేశం యొక్క చంద్రయాన్-3 మిశన్ సఫలం అయినందుకు భారతదేశ ప్రజల కు మరియు ప్రధాన మంత్రి కి హృద‌యపూర్వక అభినందనల ను తెలియ జేశారు
ఆయన యొక్క స్నేహపూర్ణమైనటువంటి స్పందన కు గాను ప్రధాన మంత్రి ధన్యవాదాల ను తెలియ జేశారు. చంద్రయాన్ యొక్క విజయం యావత్తు మానవాళి కి లభించినటువంటి జయం, విశేషించి గ్లోబల్ సౌథ్ దేశాల విజయం అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

వచ్చే నెల లో జరుగనున్న జి20 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోవడానికి విచ్చేసే శ్రీ నాహ్ యాన్ కు స్వాగతం పలకాలని తాను ఆశపడుతున్నట్లు ప్రధాన మంత్రి తెలియ జేశారు.

 

***



(Release ID: 1952955) Visitor Counter : 94