ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

వారణాసిలో జి-20 సాంస్కృతిక మంత్రుల సదస్సు ప్రతినిధుల గౌరవార్థం ప్రదర్శించిన ‘సుర్ వసుధ’పై ప్రధానమంత్రి ప్రశంసలు

Posted On: 27 AUG 2023 6:23PM by PIB Hyderabad

   వారణాసిలో జి-20 సాంస్కృతిక మంత్రుల సమావేశం సందర్భంగా వారి గౌరవార్థం కళాకారులు ప్రదర్శించిన సంగీత సమ్మేళనం ‘సుర్‌ వసుధ’ అద్భుతమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. జి-20 కూటమిసహా 29 ఆహ్వానిత దేశాల సంగీత కళాకారులు ఈ సమ్మేళనంలో తమ గాన, వాద్య ప్రతిభను ప్రదర్శించారు. విభిన్న భాషల గాయకులు తమ మాతృభాషలో, వైవిధ్య వాద్యాలతో ‘వసుధైవ కుటుంబకం’ (ప్రపంచమంతా ఒకే కుటుంబం) స్ఫూర్తిని చాటుతూ ప్రపంచ సంగీత సంస్కృతిని వారు ఆవిష్కరించారు.

దీనిపై కేంద్ర సాంస్కృతిక-పర్యాటక-ఈశాన్యభారత అభివృద్ధి శాఖ మంత్రి జి.కిషన్‌ రెడ్డి ‘ఎక్స్‌’ పోస్ట్‌ ద్వారా పంపిన సందేశంపై స్పందిస్తూ:

“వసుధైవ కుటుంబం స్ఫూర్తిని, సందేశాన్ని.. అందునా శాశ్వత కీర్తిగల కాశీ వంటి నగరం నుంచి ప్రపంచవ్యాప్తం చేయడానికి ఇంతకుమించిన సాంస్కృతిక కార్యక్రమం మరేముంటుంది!” అని ప్రధానమంత్రి కొనియాడారు.




***


DS/ST


(Release ID: 1952777) Visitor Counter : 160