ప్రధాన మంత్రి కార్యాలయం
భారత పురుషుల 4x400 మీటర్ల రిలే బృందం అద్భుత ప్రతిభకు ప్రధాని ప్రశంస
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో ఫైనల్స్‌కు అర్హత సాధించిన జట్టు
Posted On:
27 AUG 2023 6:21PM by PIB Hyderabad
ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో భారత పురుషుల 4x400 మీటర్ల రిలే పరుగు జట్టు అద్భుత ప్రతిభ చూపి, ఫైనల్స్ చేరిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఈ మేరకు అర్హత సాధించడంలో జట్టు సభ్యులు అనాస్, అమోజ్, రాజేష్ రమేష్, ముహమ్మద్ అజ్మల్ చూపిన సమష్టి కృషి అభినందనీయమన్నారు.
ఈ మేరకు ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా పంపిన సందేశంలో:
“ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్‌లో సమష్టి కృషి అద్భుతం! అనాస్, అమోజ్, రాజేష్ రమేష్, ముహమ్మద్ అజ్మల్ తమ ప్రతిభతో జట్టును ఫైనల్స్ చేర్చడమే కాకుండా 4x400 మీటర్ల రిలే పరుగులో సరికొత్త ఆసియా రికార్డు నెలకొల్పడం ముదావహం. ఈ విన్యాసం ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత చరిత్రాత్మక పునరాగమనంగా చిరకాలం గుర్తుంటుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
****
DS/ST
(Release ID: 1952776)
Visitor Counter : 143
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam