యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఆసియా క్రీడలలో 634 క్రీడాకారులు పాల్గొనేందుకు అనుమతించిన యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ
प्रविष्टि तिथि:
25 AUG 2023 5:31PM by PIB Hyderabad
రానున్న ఆసియా క్రీడలలో 38 క్రీడలలో ఎంపిక ప్రమాణాలను నెరవేర్చిన 634మంది క్రీడాకారులు పాల్గొనేందుకు యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ (ఎంవైఎఎస్) అనుమతించింది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ సూచించిన మొత్తం 850మంది క్రీడాకారుల నుంచి వీరిని ఎంపిక చేశారు.
కాగా, 2018లో జరిగిన ఆసియా క్రీడలలో మొత్తం 572మంది క్రీడాకారులు పాల్గొనగా, భారత్ 16 స్వర్ణపతకాలు సహా 70 పతకాలను కైవసం చేసుకుని తిరిగి వచ్చింది.
ఆసియా క్రీడలు 2023లో పాల్గొననున్న భారతీయ దళంలో భాగమైన క్రీడాకారుల జాబితాను దిగువన ఇవ్వడం జరుగుతోంది.
ఎవరో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండిః
***
(रिलीज़ आईडी: 1952347)
आगंतुक पटल : 201