ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దక్షిణ ఆఫ్రికా మరియు గ్రీస్  లను 2023 ఆగస్టు 22-25 మధ్య కాలం లో సందర్శించనున్న ప్రధాన మంత్రి  

Posted On: 19 AUG 2023 11:30AM by PIB Hyderabad

దక్షిణ ఆఫ్రికా గణతంత్రం యొక్క అధ్యక్షుడు శ్రీ మాటెమెలా సిరిల్ రామఫోసా ఆహ్వానించి న మీదట బిఆర్ఐసిఎస్’ (‘బ్రిక్స్’) పదిహేనో శిఖరాగ్ర సమావేశం లో పాలుపంచుకొనేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరం ఆగస్టు 22 వ తేదీ మొదలుకొని 24 వ తేదీ మధ్య కాలం లో దక్షిణ ఆఫ్రికా లోని జోహాన్స్ బర్గ్ ను సందర్శించనున్నారు.

ఇది 2019 వ సంవత్సరం నాటి నుండి చూస్తే తొలి ముఖాముఖి బ్రిక్స్ శిఖర సమ్మేళనం కానుంది. బ్రిక్స్ సభ్యత్వ దేశాలు ప్రారంభించిన కార్యక్రమాల యొక్క పురోగతి ని సమీక్షించేందుకు మరియు రాబోయే కాలం లో ఇంకా ఏయే రంగాల లో కార్యక్రమాల ను చేపట్టవచ్చో గుర్తించేందుకు ఒక అవకాశాన్ని ఈ శిఖర సమ్మేళనం ఇవ్వనుంది.

బ్రిక్స్ శిఖర సమ్మేళనం ముగిసిన తరువాత ఏర్పాటు చేసినటువంటి ఒక విశిష్ట కార్యక్రమం ‘‘బ్రిక్స్ - ఆఫ్రికా అవుట్ రీచ్ ఎండ్ బ్రిక్స్ ప్లస్ డైలాగ్’’ లో సైతం ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు; దక్షిణ ఆప్రికా ఆహ్వానించినటువంటి ఇతర దేశాలు కూడాను ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి.

ప్రధాన మంత్రి తన యాత్ర కాలం లో, జోహాన్స్ బర్గ్ కు విచ్చేసిన నాయకులలో కొందరి తో ద్వైపాక్షిక సమావేశాల లో పాలుపంచుకోనున్నారు.

దక్షిణ ఆఫ్రికా లో తన యాత్ర దరిమిలా ప్రధాన మంత్రి గ్రీస్ యొక్క ప్రధాని శ్రీ కిరియాకోస్ మిత్సోతకిస్ ఆహ్వానం పై 2023 ఆగస్టు 25 వ తేదీ నాడు గ్రీస్ లో ఆధికారిక పర్యటన ను జరపనున్నారు. గ్రీస్ ను భారతదేశాని కి చెందిన ప్రధాన మంత్రి ఒకరు సందర్శించడం గడచిన 40 సంవత్సరాల లో ఇదే ప్రథమం.

భారతదేశాని కి మరియు గ్రీస్ కు మధ్య నాగరకత పరమైన సంబంధాలు సముద్ర సంబంధి రవాణా, రక్షణ, వ్యాపారం, పెట్టుబడి మరియు ఉభయ దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు వంటి రంగాల లో సహకారం రూపేణా ఇటీవలి కాలం లో పటిష్టం అయ్యాయి. ఈ సంబంధాన్ని మరింత గాఢతరం గా మలచుకోవడం ఎలాగన్న దానిని గురించి ప్రధాని శ్రీ కిరియాకోస్ మిత్సోతకిస్ తో ప్రధాన మంత్రి చర్చించనున్నారు. గ్రీస్ లో ఉంటున్న భారతదేశం ప్రవాసి సముదాయం తో ప్రధాన మంత్రి భేటీ కానున్నారు. ఇరు దేశాల కు చెందిన వ్యాపార రంగ ప్రముఖుల తో కూడా ప్రధాన మంత్రి భేటీ అవుతారు.

 

***


(Release ID: 1950707) Visitor Counter : 158