వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఉల్లిపాయ బఫర్ 3 లక్షల మెట్రిక్ టన్నుల నుండి 5 లక్షల మెట్రిక్ టన్నులకు పెంపు
రేపటి నుంచి (సోమవారం) కిలో ఉల్లిపాయలు రిటైల్ లో రూ.25 కే విక్రయించనున్న ఎన్‌సిసిఎఫ్
Posted On:
20 AUG 2023 2:56PM by PIB Hyderabad
ప్రారంభ సేకరణ లక్ష్యాన్ని3.00 లక్షల మెట్రిక్ టన్నుల సాధించిన తర్వాత మరో గొప్ప చర్యలో భాగంగా ప్రభుత్వం ఈ సంవత్సరం ఉల్లి బఫర్ పరిమాణాన్ని 5.00 లక్షల మెట్రిక్ టన్నులకు పెంచింది. ప్రధాన వినియోగ కేంద్రాలలో సేకరించిన నిల్వలను క్రమాంకనం చేయడంతో పాటు అదనపు సేకరణ లక్ష్యాన్ని సాధించడానికి ఎన్‌సిసిఎఫ్ , నాఫెడ్ చెరొక లక్ష టన్నులు సేకరించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆదేశించింది. ప్రధాన మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని బఫర్ నుండి ఉల్లిపాయలను వినియోగించడం ప్రారంభమైంది. రాష్ట్రాలు, యుటీలలో రిటైల్ ధరలు దేశవ్యాప్త సగటు కంటే ఎక్కువగా ఉన్నాయి, లేదా మునుపటి నెల కంటే గణనీయంగా ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు వరకు, బఫర్ నుండి సుమారు 1,400 మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలు లక్ష్య మార్కెట్‌లకు పంపించడం జరిగింది. లభ్యతను పెంచడానికి నిరంతరం సరకు విడుదల చేస్తున్నారు. ప్రధాన మార్కెట్‌లలో విడుదల చేయడమే కాకుండా, బఫర్ నుండి ఉల్లిపాయలు కూడా రిటైల్ వినియోగదారులకు అందుబాటులో ఉంచుతున్నారు. రేపటి నుండి అంటే ఆగస్టు 21 నుండి ఎన్‌సిసిఎఫ్ రిటైల్ అవుట్‌లెట్‌లు, మొబైల్ వ్యాన్‌ల ద్వారా కిలోకు రూ.25/- సబ్సిడీ రేటుతో అందిస్తారు. ఇతర ఏజెన్సీలు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను కలుపుకొని రానున్న రోజుల్లో ఉల్లిపాయల రిటైల్ విక్రయం తగిన విధంగా మెరుగుపడుతుంది. ఈ బహుముఖ చర్యలు బఫర్ కోసం ప్రభుత్వం ఉల్లిని సేకరించడం, స్టాక్‌ల లక్ష్యంతో విడుదల చేయడం, ఎగుమతి సుంకం విధించడం వంటివి ఉల్లి రైతులకు లాభదాయకమైన ధరలను అందించడం ద్వారా రైతులకు, వినియోగదారులకు సరసమైన ధరలకు నిరంతరం లభ్యమయ్యేలా చూస్తాయి.
****
(Release ID: 1950668)
Visitor Counter : 125