ప్రధాన మంత్రి కార్యాలయం

ఇరాన్ ఇస్లామిక్ గణతంత్ర దేశాధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ సయ్యద్‌ ఇబ్రహీం రైజీతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంభాషణ


ద్వైపాక్షిక.. ప్రాంతీయ ప్రాధాన్యాంశాలపై దేశాధినేతల చర్చ;

దక్షిణాఫ్రికాలో నిర్వహించే బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు
నేపథ్యంలోనూ ఇద్దరు నాయకుల మధ్య సమావేశం

Posted On: 18 AUG 2023 6:12PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ ఇరాన్ ఇస్లామిక్ గణతంత్ర దేశాధ్యక్షుడు గౌరవనీయ డాక్టర్ సయ్యద్‌ ఇబ్రహీం రైజీతో ఫోన్‌ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా దేశాధినేతలిద్దరూ అనేక ద్వైపాక్షిక, ప్రాంతీయ ప్రాధాన్యాంశాలపై చర్చించారు. భారత-ఇరాన్‌ల మధ్య బలమైన స్నేహసంబంధాలకు చారిత్రక, నాగరికతాపరమైన సాన్నిహిత్యంతోపాటు ప్రజల మధ్యగల బలమైన బంధం మద్దతునిచ్చాయని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.

   అనుసంధాన కూడలిగా ఇరాన్‌లోని చాబహార్ రేవుకుగల సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం సహా ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపైనా తమ నిబద్ధతను అధినేతలిద్దరూ పునరుద్ఘాటించారు. అలాగే దక్షిణాఫ్రికాలో నిర్వహించనున్న ‘బ్రిక్స్‌’ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో కూటమి విస్తరణతోపాటు బహుపాక్షిక చర్చా వేదికలపై సహకారం గురించి కూడా వారు చర్చించారు. మరో్వైపు ఈ సదస్సు నేపథ్యంలో పరస్పరం సమావేశం కావాలని కూడా నిర్ణయించుకున్నారు.

*****



(Release ID: 1950382) Visitor Counter : 113