హోం మంత్రిత్వ శాఖ
18 ఆగస్టు 2023న ఉత్తర్ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలోని సిఆర్‌పిఎఫ్ గ్రూప్ సెంటర్‌లో 4వ కోటి మొక్కను నాటనున్న కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి శ్రీ అమిత్ షా
దేశవ్యాప్తంగా భారీ, మానవీయ, ప్రత్యేకమైన మొక్కలు నాటే డ్రైవ్‌ను 12 జులై 2020న ప్రారంభించిన హోం మంత్రి
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనికతో, హోం మంత్రి, సహకార మంత్రి అమిత్ షా నాయకత్వంలో సిఆర్‌పిఎప్‌లు 2020 నుంచి 2022 వరకు మూడేళ్ళ వ్యవధిలో దేశవ్యాప్తంగా ఏకంగా 3.55 కోట్ల మొక్కలు నాటారు
2023వ సంవత్సరానికి అన్ని సిఆర్‌పిఎఫ్‌లు 1.5 కోట్ల మొక్కాలను నాటాలనే సామూహిక నిర్దేశిత లక్ష్యంతో 5 కోట్లకు చేరుకోనున్న మొత్తం నాటిన మొక్కలు, ఇది దేశం మొత్తం పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలకు సిఆర్‌పిఎఫ్‌ల ఆదర్శప్రాయదమైన సహకారం
సిఆర్‌పిఎఫ్ 8 వేర్వేరు ఆవరణలలో కొత్తగా నిర్మించిన వివిధ రకాలైన 15 అద్భుతమైన భవనాలను కూడా ఎలక్ట్రానిక్‌గా ప్రారంభించనున్నహోం మంత్రి
Posted On:
17 AUG 2023 4:03PM by PIB Hyderabad
కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ఆగస్టు 18, 2023 శుక్రవారంనాడు ఉత్తర్‌ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో కేంద్ర రిజర్వు పోలీసు దళం (సిఆర్‌పిఎఫ్) గ్రూప్ సెంటర్‌లో 4వ కోటి మొక్కను నాటనున్నారు. సిఆర్‌పిఎఫ్‌కు చెందిన 8 భిన్న ఆవరణలలో కొత్తగా నిర్మించిన 15 అద్భుతమైన వివిధ రకాల భవనాలను హోం మంత్రి ఎలక్ట్రానిక్‌గా ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రత్యేకమైన ఈ భారీ, మానవీయ మొక్కలు నాటే డ్రైవ్‌ను హోం మంత్రి శ్రీ అమిత్ షా 12 జులై 2020న ప్రారంభించారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ దార్శనికతో స్ఫూర్తిని పొంది, హోం మంత్రి, సహకార మంత్రి శ్రీ అమిత్ షా నాయకత్వంలో సిఆర్‌పిఎఫ్ 2020 నుంచి 2022 వరకు మూడేళ్ళ కాలంలో 3.55 కోట్లకు పైగా మొక్కలను దేశవ్యాప్తంగా నాటింది. అన్ని కేంద్ర రిజర్వ్ పోలీసు దళాలు కలిసి 2023వ సంవత్సరానికి 1.5 కోట్ల మొక్కలను నాటాలన్నది లక్ష్యం. దీనితో మొత్తం నాటిన మొక్కల సంఖ్య 5 కోట్లు కానుది. మొత్తం పర్యావరణ పరిరక్షణ కోసం దేశం చేస్తున్న కృషిలో ఇది సిఆర్‌పిఎఫ్ తరుఫు నుంచి ఆదర్శప్రాయమైన సహకారం కానుంది. భూమాతకు నిజమైన కృతజ్ఞతకు చిహ్నంగా కూడా ఉంటుంది.
నిర్దేశిత సెక్టార్లలో నాటడానికి తగిన జాతులపై టైమ్ టేబుల్‌ను రూపొందించి, దానికోసం ఒక నోడల్ అధికారిని నియమించారు.
సాధ్యమైనంతవరకు స్థానిక జాతులను నాటాలని, వేసే మొత్తం చెట్లలో కనీసం సగానికి పైగా 100 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ జీవిత చక్రం ఉండే దీర్ఘకాలం ఉండే చెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా, ఔషధ, పర్యావరణ అనుకూల చెట్లకు ప్రాధాన్యత ఇచ్చేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
దేశ అంతర్గత భద్రతను కొనసాగించడం, దేశ ఐక్యతను, సమగ్రతను నిలబెట్టడం పట్ల తన నిబద్ధతకు కట్టుబడి ఉండటంతో పాటు, పర్యావరణ పరిరక్షణ, రక్షణ, సంక్షేమానికి అనుగుణంగా తమ భవిష్యత్ ప్రయత్నాలను సమలేఖనం చేయడంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు తమ దృఢమైన అంకితభావాన్ని పునరుద్ఘాటించారు.
****
(Release ID: 1950039)