ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాని నరేంద్ర మోదీతో అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం భేటీ


భారత్‌-అమెరికా సంబంధాలకు అమెరికా కాంగ్రెస్
నిరంతర.. ద్వైపాక్షిక మద్దతుపై ప్రధాని అభినందన;

ఈ ఏడాది జూన్‌లో తన పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌నుద్దేశించి
రెండోసారి చారిత్రక ప్రసంగం చేయడాన్ని గుర్తుచేసుకున్న ప్రధాని;

ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు.. చట్టాలపట్ల గౌరవం.. ప్రజల మధ్య
బలమైన సంబంధాలను ప్రశంసించిన ప్రధాని.. అమెరికా బృందం

Posted On: 16 AUG 2023 7:43PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీని ఇవాళ ఎనిమిదిమంది సభ్యుల అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం న్యూఢిల్లీలో కలుసుకుంది. ఈ భారత మద్దతు బృందంలో ఇండియా కాకస్ డెమోక్రటిక్ కో-ఛైర్ రో ఖన్నా, రిపబ్లికన్ కో-ఛైర్ మైక్ వాల్జ్‌, ఇతర ప్రతినిధులు ఎడ్ కేస్, కాట్ కమాక్, డెబోరా రాస్, జాస్మిన్ క్రోకెట్, రిచ్ మెకార్మిక్, శ్రీ ఠానేదార్ ఉన్నారు. ప్రధానమంత్రి ఈ బృందాన్ని స్వాగతిస్తూ… భారత్‌-అమెరికా సంబంధాలకు అమెరికా కాంగ్రెస్‌ ఉభయపక్షాలు నిరంతర మద్దతివ్వడాన్ని అభినందించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆహ్వానంపై ఈ ఏడాది జూన్‌లో తన అమెరికా పర్యటన నేపథ్యంలో అమెరికా కాంగ్రెస్‌నుద్దేశించి రెండోసారి చారిత్రక ప్రసంగం చేసే అవకాశం లభించడాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు.

   భారత్‌-అమెరికా సమగ్ర వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యానికి రెండు దేశాలలో ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, చట్టాలపట్ల గౌరవం, ప్రజల మధ్య బలమైన సంబంధాలు పునాదిగా ఉన్నాయని ఈ సందర్భంగా ప్రధానితోపాటు అమెరికా కాంగ్రెస్‌ ప్రతినిధి బృందం ఏకాభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.


(Release ID: 1949769) Visitor Counter : 156